ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిSP Rajesh Chandra | జిల్లాలో రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం : ఎస్పీ రాజేష్​ చంద్ర

    SP Rajesh Chandra | జిల్లాలో రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం : ఎస్పీ రాజేష్​ చంద్ర

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : SP Rajesh Chandra | జిల్లాలో రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కామారెడ్డి ఎస్పీ రాజేష్​ చంద్ర (kamareddy sp rajesh chandra) తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఆయన జిల్లాలోని రౌడీ షీటర్ల (rowdy sheeters)తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంటుందని హెచ్చరించారు. ఆరు నెలలకు ఒకసారి రౌడీ మేళా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

    SP Rajesh Chandra | 13 మందిపై రౌడీ షీట్​ ఎత్తివేత

    రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని ఎస్పీ సూచించారు. పోలీసు రికార్డ్స్, జిల్లా పోలీసు అధికారుల కమిటీ నివేదిక ప్రకారం మంచి ప్రవర్తన కనబరిచిన 13 మందిపై రౌడీ షీట్లు ఎత్తివేసినట్లు ఆయన తెలిపారు. నిష్పక్షపాత విచారణతో కమిటీ నివేదిక ఆధారంగా 10 ఏళ్లుగా సత్ప్రవర్తనతో ఉన్నవారిపై రౌడీ షీట్​ ఎత్తివేశామన్నారు. మిగతా వారు కూడా పద్ధతి మార్చుకొని మెలగాలని సూచించారు.

    SP Rajesh Chandra | వారిపై కఠిన చర్యలు

    రౌడీయిజాన్ని ప్రోత్సహించే చర్యలకు జిల్లాలో చోటులేదని ఎస్పీ స్పష్టం చేశారు. రౌడీ షీట్లు ఉండి మరలా నేరాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలను బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం, హింసాత్మక చర్యలు చేయడం లాంటి నేరాలను పూర్తిగా మానుకోవాలని సూచించారు. మంచి ప్రవర్తన కనబరిచిన వారి రౌడీషీట్లు మాత్రమే తొలగిస్తామన్నారు. గంజాయి, రౌడీయిజం, హత్యలు, హత్యాయత్నాలు, గొడవలు మొదలైన అసాంఘిక కార్యకలాపాల్లో పాల్పడుతున్న రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ (pd act) కూడా పెడతామని ఆయన హెచ్చరించారు.

    అలాగే సోషల్ మీడియా (social media)లో కత్తులతో ఫొటోలు పోస్ట్ చేయడం, రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం చేస్తే సహించమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఏఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్ రావు, విఠల్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ తిరుపతయ్య, డీసీఆర్బీ సీఐ మురళి పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...