kcr, harish rao meeting
KCR | ఎర్రవల్లి ఫామ్​హౌస్​లో కేసీఆర్, హరీశ్​ రావు భేటీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KCR | ఎర్రవెల్లి ఫామ్​హౌస్​లో Erravalli Farmhouse మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (former CM KCR​), మాజీ మంత్రి హరీశ్​రావు (Harish rao) భేటీ అయ్యారు. విచారణకు హాజరు కావాలని కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission​) కేసీఆర్​, హరీశ్​రావు, ఈటల రాజేందర్​కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్​తో హరీశ్​రావు భేటీ అయ్యారు.

జూన్​ 5న కేసీఆర్​, జూన్​ 6న హరీశ్​రావు, జూన్​ 9న ఈటల రాజేందర్​ విచారణకు రావాలని కమిషన్​ నోటీసుల్లో సూచించింది. ఈ క్రమంలో విచారణకు వెళ్లాలా వద్దా? అనే దానిపై కేసీఆర్​, హరీశ్​రావు చర్చిస్తున్నట్లు సమాచారం. నోటీసులపై 15 రోజుల్లో స్పందించాలని కమిషన్​ పేర్కొంది. ఈ క్రమంలో ఎలా స్పందించాలి, విచారణకు వెళ్లాలా వద్ద అనే అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం.