అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో Hyderabad Metro ప్రయాణికులకు సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల ఛార్జీలను పెంచి charges hike ప్రయాణికులపై భారం మోపిన మెట్రో తాజాగా పెరిగిన ఛార్జీలను సవరించింది. సంస్థకు నష్టాలు వస్తున్నాయని ఇటీవల మెట్రో ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. మే 17 నుంచి పెరిగిన రేట్లు అమలులోకి వచ్చాయి.
ప్రస్తుతం కనిష్టంగా ఉన్న రూ.10 టికెట్ ధర రూ.12కు, గరిష్ట ధర రూ.60 నుంచి రూ.75కు పెరిగింది. మొదటి రెండు స్టాపులకు రూ.12, రెండు నుంచి నాలుగు స్టాపుల వరకు రూ.18 చొప్పున వసూలు చేస్తున్నారు. నాలుగు నుంచి ఆరు స్టాపుల వరకు రూ.30, ఆరు నుంచి తొమ్మిది స్టాపుల వరకు రూ.40 చొప్పున టికెట్ రేట్లను సవరించారు.
Hyderabad Metro | పది శాతం రాయితీ
టికెట్ల పెంపు నిర్ణయంతో హైదరాబాద్ మెట్రో సంస్థపై వ్యతిరేకత వచ్చింది. దీంతో నిర్వాహణ బాధ్యతలు చూస్తున్న ఎల్అండ్టీ LT సంస్థ దొగిచ్చింది. పెంచిన ఛార్జీలలో పది శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 24వ తేదీ నుంచి రాయితీలు వర్తించనున్నాయి. ఇటీవల పెంచిన టికెట్ ధరల్లో పది శాతం తగ్గిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
Hyderabad Metro | ఎల్అండ్‌టీకి భారీగా నష్టాలు..
హైదరాబాద్ (hyderabad)లో మొదటి దశ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ సంస్థ నిర్మించింది. ప్రైవేటు, ప్రభుత్వ (PPP) భాగస్వామ్యంలో 2012లో రూ.14,132కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించి 2017 నవంబరులో పూర్తిచేశారు. మియాపూర్-ఎల్‌బీ నగర్, జేబీఎస్ -ఎంజీబీఎస్, నాగోలు-రాయదుర్గం మధ్య 69.2 కిలోమీటర్ల పరిధిలో పనులు పూర్తిచేశారు. ప్రస్తుతం రోజుకు 1,200సర్వీసులు నడుస్తుండగా 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో 5.10లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు.
కరోనా (corona)కు ముందు రోజుకు రూ.80 లక్షలకు పైగా ఆదాయం సమకూర్చుకున్న సంస్థ.. తర్వాత నుంచి కుదేలైంది. 2020 నుంచి 2022 వరకు ప్రయాణికుల రాకపోకలు తగ్గడంతో పాటు మాల్స్, ప్రకటనల నుంచి ఆశించిన ఆదాయం రాలేదు. ఇదే సమయంలో రవాణా ఆధారిత అభివృద్ధి (TOD) కింద ప్రభుత్వం ఇచ్చిన 267 ఎకరాల భూమిలో కేవలం నాలుగైదు ప్రాంతాల్లోనే కమర్షియల్ కాంప్లెక్సులు నిర్మించింది. చాలావరకు భూములు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం (congress govt) తెచ్చిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మెట్రోపై పడిందని ఎల్ అండ్ టీ అధికారులు చెబుతున్నారు. దీంతో రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా పెంచిన రేట్లలో పది శాతం రాయితీ ఇచ్చింది.