అక్షరటుడే, వెబ్డెస్క్: PM Modi | జమ్మూకశ్మీర్‌లో టూరిస్టులపై ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ(PM Modi) తన సౌదీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని భారత్కు వచ్చిన విషయం తెలిసిందే. కాగా.. తిరుగు పయనంలో ఆయన విమానం పాక్ pak border గగనతలం మీదుగా ప్రయాణించలేదు. మరో మార్గంలో భారత్కు saudi to india చేరుకున్నారు. ఈ విషయం ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్‌లోని దృశ్యాల ఆధారంగా తెలిసింది.
PM Modi | అరేబియా సముద్రం మీదుగా..
ప్రధాని మోదీ సౌదీకి ప్రయాణించిన విమానం పాకిస్థాన్ (Pakistan) గగనతలం మీదుగా రియాద్ చేరుకుంది. అయితే.. ఉగ్రదాడి జరగడంతో ఆయన వెంటనే భారత్కు బయలుదేరారు. కాగా.. ముందు జాగ్రత్త చర్యగా తిరుగు ప్రయాణంలో ప్రత్యామ్నాయ మార్గంలో వచ్చారు. ప్రధాని ప్రయాణించిన ఫ్లయిట్ అరేబియా సముద్రం మీదుగా గుజరాత్ గగనతలంలోకి ప్రవేశించి అక్కడి నుంచి దిల్లీకి చేరుకుంది. పాక్ నుంచి pak terrorist attack ముప్పు ఉండొచ్చన్న అనుమానంతో మార్గాన్ని మార్చినట్లు తెలుస్తోంది.