అక్షరటుడే, వెబ్‌డెస్క్: Travel agents | వలసల విషయంలో అమెరికా(America) కఠిన వైఖరి అవలంభిస్తోంది. ఇప్పటికే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ ప్రభుత్వం(Trump Government) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోకి అక్రమ వలసలకు(illegal immigration) కారణమైన ట్రావెల్ ఏజెంట్ల(Travel agents)పై ఆంక్షలు విధించింది. అమెరికాలోకి అక్రమ వలసలను ప్రోత్సహిస్తూ మానవ అక్రమ రవాణాకు పాల్పడే వారిని గుర్తించేందుకు భారత్‌లోని అమెరికా ఎంబసీ(American Embassy), కాన్సులేట్ కార్యాలయాలు(American Consulate) నిత్యం ప్రయత్నిస్తుంటాయని విదేశాంగ శాఖ(Department of Foreign Affairs) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో అమెరికాలోకి అక్రమ వలసలను ప్రోత్సహించిన ట్రావెల్ ఏజెంట్(Travel agents) సంస్థల ఓనర్లు, సంస్థల ఉన్నతోద్యోగులు, సిబ్బందిపై ఆంక్షలు విధిస్తున్నట్టు పేర్కొంది. భవిష్యత్తులో కూడా ఈ చర్యలు కొనసాగుతాయని హెచ్చరించింది.
Travel agents | ఎవరికీ మినహాయింపు లేదు..
అక్రమ వలసలతో వచ్చే ప్రమాదాలపై విదేశీయులకు అవగాహన కల్పించడంతో పాటు వీటిని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విదేశాంగ శాఖ(Department of Foreign Affairs) పేర్కొంది. అమెరికాలో చట్టబద్ధ పాలన, పౌరుల పరిరక్షణకు ఇది అవసరమని తేల్చి చెప్పింది. ఈ ఆంక్షలు అందరికీ వర్తిస్తాయని, వీసా వైవర్ ప్రోగ్రామ్(Visa Waiver Program) పరిధిలోని వారికి కూడా మినహాయింపు లేదని స్పష్టం చేసింది. అయితే, ఏయే ట్రావెల్ ఏజెంట్స్(Travel agents)పై ఆంక్షలు విధించారనే విషయాలను వెల్లడించేందుకు మన ఎంబసీ నిరాకరించింది.
Travel agents | ట్రంప్ కఠినాత్మక వైఖరి
వలసల విషయంలో ప్రధానంగా భారతీయుల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. హెచ్-1బీ వీసా(H-1B visa) మొదలు విద్యార్థి వీసాల వరకూ ఏవీ దక్కకుండా నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే వీసాలను రద్దు చేస్తూ విదేశీయులను నిర్దాక్షిణ్యంగా సొంత దేశాలకు పంపించేస్తున్నారు.