అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు(domestic stock markets) మంగళవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 57 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్(Sensex).. ఇంట్రాడేలో గరిష్టంగా 191 పాయింట్లు పెరిగింది. గరిష్టాలనుంచి 446 పాయింట్లు పతనమైంది. 51 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ(nifty).. ఇంట్రాడేలో గరిష్టంగా 65 పాయింట్లు లాభపడింది. గరిష్టాలనుంచి 149 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 12.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 308 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 76 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో సూచీలు భారీగా పెరగడం, కోవిడ్(covid) వ్యాప్తి, వివిధ దేశాల మధ్య ట్రేడ్ పాలసీల విషయంలో అనిశ్చితి కొనసాగుతుండడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. స్వల్పంగా ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది.
Stock Markets | స్మాల్ క్యాప్‌లో కొనసాగుతున్న ర్యాలీ
స్మాల్ క్యాప్ (Small cap) స్టాక్స్‌లో ర్యాలీ కొనసాగుతోంది. మంగళవారం బీఎస్‌ఈ (BSE) స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.21 శాతం పెరగ్గా.. మిడ్ క్యాప్ 0.25 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.09 శాతం నష్టంతో కొనసాగుతున్నాయి. మెటల్ ఇండెక్స్ (metal index) 1.1 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 0.7 శాతం పెరిగాయి. ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, రియాలిటీ ఇండెక్స్‌లు అర శాతానికిపైగా లాభంతో ఉన్నాయి. పీఎస్‌యూ, ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు స్వల్ప లాభాలతో కదలాడుతున్నాయి. టెలికాం, ప్రైవేట్ బ్యాంక్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. టెలికాం (telecom) ఇండెక్స్ 0.75 శాతం పడిపోగా.. ఆటో ఇండెక్స్ 0.5 శాతం, ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 0.42 శాతం, బ్యాంకెక్స్ 0.35 శాతం క్షీణించాయి. హెల్త్‌కేర్, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరెబుల్, ఇన్‌ఫ్రా సూచీలు స్వల్ప నష్టాలతో ఉన్నాయి.
Stock Markets | Top Gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 10 కంపెనీలు లాభాలతో సాగుతుండగా.. 20 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. టాటా స్టీల్ (tata steel) 1.3 శాతం లాభంతో ఉండగా.. ఇన్ఫోసిస్ (infosys) ఒకశాతం, ఐటీసీ 0.9 శాతం, ఎన్టీపీసీ 0.8 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 0.7 శాతం లాభంతో కొనసాగుతున్నాయి.
Stock Markets | Top Losers..
ఎటర్నల్ (eternal) 2.75 శాతం నష్టంతో ఉండగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎంఅండ్ఎం ఒక శాతానికిపైగా నష్టంతో, మారుతి, హిందుస్థాన్ యూనిలీవర్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ అర శాతానికిపైగా నష్టాలతో ఉన్నాయి.