అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pakistani Spies Arrested | పహల్గామ్ దాడి (pahalgam attack) తర్వాత దేశం అంతటా కూడా ఉగ్రవాద నిర్మూలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో ప్రభుత్వం కూడా చర్యలు వేగంగా జరుపుతుంది.. కేంద్రం దిశానిర్దేశంతో భద్రతా సంస్థలు దేశం లోపలే ఉంటూ విదేశీ శత్రు శక్తులని సంహరిస్తుంది. అలానే వారికి సహకరించే వారిపై నిఘా ఉంచి అరెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ గూఢచారుల అరెస్టుల (pakistan spies arrest) సంఖ్య ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకూ పాకిస్తానీ గూఢచారులు 14 మందిని కేంద్ర రక్షణా దళం అరెస్ట్ చేయగా, ఇందులో ఇంకెంతమంది ఉన్నారో అని జనాలు ముచ్చటించుకుంటున్నారు.
Pakistani Spies Arrested | గుట్టు లాగుతున్న పోలీసులు
పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేయడం, భారత సైనిక (indian military) సమాచారాన్ని పాకిస్తాన్ అధికారులకు చేరవేయడం వంటి ఆరోపణలపై మూడు రాష్ట్రాల నుంచి మొత్తం14 మందిని అరెస్టు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ 14 మంది గూఢచారులు హర్యానా (haryana), పంజాబ్ (punjab), ఉత్తరప్రదేశ్‌కు (uttar pradesh) చెందిన వారిగా గుర్తించారు. గూఢచర్యానికి హబ్‌గా ఢిల్లీలోని పాకిస్తాన్ (Pakistani embassy at delhi) రాయబార కార్యాలయం మారడం మరో విశేషం. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతదేశంలో పట్టుబడిన పాకిస్తానీ గూఢచారులందరిలో, చాలా మందికి పాకిస్తాన్ రాయబార కార్యాలయంతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
రాయబార కార్యాలయం పేరుతో భారత్‌లో ఒక గూఢచర్య హబ్‌ను పాకిస్తాన్ ఏర్పాటు చేసి అక్కడ నుండి తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల (india – pakistan tension) తర్వాత భారతదేశంలో అరెస్టయిన గూఢచారులలో ఎక్కువ మంది న్యూఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించిన తర్వాత ఇలా గూఢచారులుగా మారినట్లు అధికారులు గుర్తించారు. పాకిస్తాన్ వీసా (pakistan visa), పాకిస్తాన్ పౌరసత్వం, డబ్బు సులభంగా లభిస్తాయని హామీ ఇవ్వడంతో గూఢచర్యానికి నిందితులు సిద్దమైనట్లు టాక్ నడుస్తోంది. పాకిస్తాన్ ఐఎస్ఐ నిఘా వర్గాలకు (pakistani ISI intelligence) ఎలాంటి సమాచారం చేరవేశారు. ఉగ్రవాదులతో సంబంధాలు, నగదు లావాదేవీలు (cash transactions) సహా పహల్గామ్ ఉగ్రదాడి కోణాల్లో గూఢచర్యానికి పాల్పడిన వారిని దర్యాప్తు సంస్థలు పలు కోణాల్లో విచారిస్తున్నారు. పహల్గామ్ దాడి దరిమిలా ఉగ్రవాదులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం (central governament) తీవ్రంగా గాలింపులు చేపడుతోంది. ఇందులో భాగంగా టెర్రరిస్టులకు సహకరిస్తున్న వారిని గుర్తించడం మీద నిఘా వర్గాలు ఫోకస్ చేశాయి.