ePaper
More
    HomeసినిమాMiss Sri Lanka Anudi Gunasekara | విజయ్ దేవరకొండతో నటించాలని ఉంది : మిస్...

    Miss Sri Lanka Anudi Gunasekara | విజయ్ దేవరకొండతో నటించాలని ఉంది : మిస్ శ్రీలంక అనుది గుణశేఖర

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Miss Sri Lanka Anudi Gunasekara | శ్రీలంక మిస్ వరల్డ్ 2024(Sri Lanka Miss World 2024) విజేత అనుది గుణశేఖర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె తన సినీ ఆశయాలను పంచుకున్నారు. తనకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ(Telugu film industry)లో ప్రవేశించాలనే ఆసక్తి ఉందన్నారు.

    ముఖ్యంగా నటుడు విజయ్ దేవరకొండ(actor Vijay Deverakonda)తో కలిసి నటించాలనే కోరికను అనుది గుణశేఖర వ్యక్తపరిచారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె విజయ్ దేవరకొండను తన అభిమాన నటుడిగా పేర్కొన్నారు. అతని నటన, వ్యక్తిత్వం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పుకొచ్చారు.

    అనుది గుణశేఖర ప్రస్తుతం శ్రీలంక తరఫున అంతర్జాతీయ వేదికలపై ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రీలంకలో నెలకొన్న పీరియడ్ పావర్టీ సమస్యను ఆమె “సహెలి”(Saheli) అనే సామాజిక కార్యక్రమం(social program) ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అనుది సామాజిక సేవలోనూ పాల్గొంటున్నారు.

    ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నిర్మిస్తున్న “కింగ్‌డమ్”(Kingdom) అనే తెలుగు యాక్షన్ స్పై థ్రిల్లర్ చిత్రం(Telugu action spy thriller film)లో నటిస్తున్నారు. ఈ చిత్రం జులై 4, 2025న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో పాటు భగ్యశ్రీ బోర్స్(Bhagyasree Bors), సత్యదేవ్(Satyadev) ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కింగ్​డమ్​ చిత్రం తెలుగు(Telugu), హిందీ(Hindi), తమిళ(Tamil) భాషల్లో తీసుకొస్తున్నారు.

    శ్రీలంక బ్యూటీ క్వీన్​ అనుది గుణశేఖర(Sri Lankan beauty queen Gunasekara) నటనపై ఆసక్తి కనబర్చడం.. విజయ్ దేవరకొండతో కలిసి పనిచేయాలనే కోరికను వ్యక్తం చేయడం ప్రస్తుతం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ అంశం భవిష్యత్తులో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలను అన్వేషించడానికి మార్గం సుగమం చేసే అవకాశం లేకపోలేదు. ఒకవేళ నిజంగానే విజయ్ దేవరకొండతో ఆమె కలిసి నటించే అవకాశం కలిగితే, అది తెలుగుతోపాటు శ్రీలంక సినీ ప్రేక్షకుల(Sri Lankan film audiences)కు కొత్త అనుభూతిని అందించగలదనడంలో సందేహం లేదు.

    Latest articles

    Vice President election | ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్​ విడుదల.. పోలింగ్​ ఎప్పుడంటే..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice President election : భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కీలక అప్​డేట్​ చోటుచేసుకుంది....

    Heavy Rains | దంచికొట్టిన వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు

    అక్షరటుడే, ఇందూరు: Heavy Rains : ఉభయ కామారెడ్డి, నిజామాబాద్​ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. గురువారం తెల్లవారుజాము...

    Gold Price | పైపైకి పోతున్న బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు కొనేవారు ఏం చేయాలంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price : భారతదేశంలో బంగారం Gold మరియు వెండి ధరలు రోజువారీగా మారుతూ ఉండటం...

    Gifty nifty | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gifty nifty | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. బుధవారం యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు...

    More like this