Terror Attack | హనీమూన్​ కోసం వచ్చి.. ఉగ్రదాడిలో మృతి
Terror Attack | హనీమూన్​ కోసం వచ్చి.. ఉగ్రదాడిలో మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Terror Attack | ఎండాకాలంలో కశ్మీర్​(Kashmir) అందాలను చూసి వద్దామని వెళ్లిన వారి జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. సరదాగా కుటుంబంతో గడుపుదామని వెళ్లిన వారిని ఉగ్రవాదులు(Terrorists) అంతం చేశారు. ప్రశాంతంగా ఫ్యామిలీతో ఎంజాయ్​ చేద్దామనుకుంటే.. ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నింపారు టెర్రరిస్టులు. మంగళవారం కశ్మీర్​లోని పహల్గామ్(Pahalgam)​లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇందులో అప్పడు పెళ్లయిన జంట హానీమూన్(Honeymoon)​ కోసం రాగా కాల్పుల్లో భర్త చనిపోయాడు.

హరియాణా(Haryana)కు చెందిన వినయ్‌ నర్వాల్‌ నౌకదళంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏప్రిల్ 16న ఆయనకు వివాహం కాగా 19న విందు నిర్వహించారు. అనంతరం భార్యను తీసుకొని కశ్మీర్‌(Kashmir)కు హనీమూన్‌కు వెళ్లారు. మంగళవారం జరిగిన ఉగ్ర దాడిలో నర్వాల్‌ ప్రాణాలు కోల్పోయారు.

Terror Attack | కళ్లెదుటే భర్త తలపై కాల్చి..

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన శుభమ్‌ ద్వివేదికి ఫిబ్రవరి 12న పెళ్లి అయింది. దీంతో వెకేషన్(Vacation)​ కోసమని భార్యను తీసుకొని ఇటీవల కశ్మీర్‌ వెళ్లారు. మంగళవారం జరిగిన కాల్పుల్లో ఆయన సైతం చనిపోయారు. తన కళ్లెదుటే భర్త తలపై తుపాకి పెట్టి కాల్చి చంపారని ద్వివేది భార్య రోదిస్తూ తెలిపారు.

Terror Attack | అమెరికా నుంచి వచ్చి..

పశ్చిమ బెంగాల్‌కు చెందిన బితాన్‌ అధికారి అమెరికాలోని ఫ్లోరిడా(Florida)లో స్థిరపడ్డారు. టీసీఎస్‌(TCS)లో పనిచేస్తున్న ఆయన ఏప్రిల్‌ 8న భార్య కుమారుడితో కలిసి బెంగాల్​ వచ్చాడు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుదామని వారం క్రితం కశ్మీర్ వెళ్లగా ఉగ్రదాడిలో బితాన్​ చనిపోయారు. ఒడిశాకు చెందిన అకౌంట్స్‌ అధికారి ప్రశాంత్‌ సత్పతీ, సూరత్‌కు చెందిన శైలేష్‌ కడతియా తమ కుటుంబంతో ఎంజాయ్​ చేయడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు.