అక్షరటుడే, బోధన్: MLA Sudharshan Reddy | ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో పెంటకలాన్‌లోని జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. దీంతో ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి సోమవారం పాఠశాల హెచ్‌ఎం అబ్బయ్యతో పాటు, ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. అలాగే పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణతకు కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గంగాశంకర్ పాల్గొన్నారు.