ePaper
More
    HomeతెలంగాణCM Revanth Reddy | సన్నాసుల గురించి పట్టించుకోను.. ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ ఫైర్

    CM Revanth Reddy | సన్నాసుల గురించి పట్టించుకోను.. ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ ఫైర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: CM Revanth Reddy | రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో కొందరు సన్నాసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారి ప్రచారం తనకు లెక్క కాదన్నారు. లబ్ధిపొందిన వాళ్లు తనను గుర్తు పెట్టుకుంటే చాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐదారుగురు సన్నాసులు ఉండొచ్చని.. కావాలని విషం చిమ్మాలని చూస్తున్నారని.. వాళ్ల గురించి తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. అచ్చంపేట నియోజకవర్గంలో అమ్రాబాద్‌ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’(Indira saura giri jala vikasam) పథకాన్ని సీఎం ప్రారంభించారు. ‘నల్లమల డిక్లరేషన్‌’(Nallamala Declaration)ను సైతం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఒకప్పుడు నల్లమల అంటే వెనుకబడిన ప్రాంతమని సీఎం అన్నారు. ఎవరో ఒక నాయకుడు వచ్చి అభివృద్ధి చేయాలని అనేవాళ్లని గుర్తు చేశారు. పాలమూరు, నల్లమల ప్రాంత వాసినని గర్వంగా చెప్పుకొంటానని పేర్కొన్నారు.

    CM Revanth Reddy | ఈ ప్రాంతం రుణం తీర్చుకుంటా

    కాంగ్రెస్‌ పార్టీని గెలిపించిన ఈ ప్రాంతం రుణం తీర్చుకుంటానని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా పాలమూరు వాసులను పిలిచేవారన్నారు. ఇక్కడి నుంచి వెళ్లిన ప్రజలు కట్టిన ప్రాజెక్టులు నేడు దేశానికి వెన్నెముకగా నిలిచాయని పేర్కొన్నారు.

    CM Revanth Reddy | దేశానికి ఇందిగాంధీ లాంటి ప్రధాని కావాలి

    దేశానికి ఇందిరా గాంధీ(Indira gandhi) లాంటి పౌరుషం ఉన్న ప్రధాని కావాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. ఐదు దశాబ్దాల తర్వాత కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నారన్నారు. పహల్​గామ్​ దాడి తర్వాత.. ఇందిరమ్మ లాంటి ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఇందిరా గాంధీ పాకిస్థాన్​ను రెండుగా చీల్చి.. నిటారుగా నిలబడ్డారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.

    More like this

    Health Tips | వంటింట్లో ఆరోగ్యం .. ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Health Tips | జ్ఞాపకశక్తిని పెంపొందించడం, మనస్సును పదునుగా ఉంచేవి ఎన్నో మన వంట...

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...