ePaper
More
    HomeజాతీయంSansad Ratna Awards | 17 మంది ఎంపీల‌కు సంస‌ద్ ర‌త్న అవార్డులు

    Sansad Ratna Awards | 17 మంది ఎంపీల‌కు సంస‌ద్ ర‌త్న అవార్డులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sansad Ratna Awards | పార్ల‌మెంట్‌(Parliament)లో చేసిన కృషికి గాను సంస‌ద్ ర‌త్న అవార్డులు Sansad Ratna awards ప్రదానం చేస్తారు. కాగా.. సంసద్‌ రత్న అవార్డు 2025కు ఎంపీలు భర్తృహరి మహతాబ్‌, రవి కిషన్‌ సహా 17 మంది పార్లమెంట్‌ సభ్యులు, రెండు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలను ఎంపిక చేశారు. పార్లమెంట్‌కు సభ్యులు చేసిన కృషి ఆధారంగా ప్రైమ్‌ పాయింట్‌ ఫౌండేషన్‌(Prime Point Foundation) ఈ అవార్డులను అందజేస్తుంది. వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ (NCBC) చైరెన్‌ హన్స్‌రాజ్‌ అహిర్‌ నేతృత్వంలోని జ్యూరీ కమిటీ అవార్డు గ్రహీతలను ఎంపిక చేసింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అత్యుత్తమ, స్థిరమైన సహకారం అందించిన మహతాబ్‌, సుప్రియా సూలే (ఎన్సీపీ-ఎస్పీ), ఎన్‌కే ప్రేమచంద్రన్‌ (ఆర్‌ఎస్‌పీ) శ్రీరంగ్‌ అప్పా బర్నేలు ఈ అవార్డులు దక్కించుకున్నారు.

    Sansad Ratna Awards | సంస‌ద్ ర‌త్న అవార్డ్స్..

    ఈ నలుగురు ఎంపీలు MP 16, 17వ లోక్‌సభ(Loksabha)ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారని, ప్రస్తుత పదవీ కాలంలోనూ అదే పనితీరును కొనసాగిస్తున్నారని ప్రైమ్‌ పాయింట్‌ ఫౌండేషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, సిత్మా వాగ్‌ (బీజేపీ), అర్వింద్‌ సవంత్‌ (శివసేన – యూబీటీ), నరేష్‌ గణపతి మహస్కే (శివసేన), వర్షా గైక్వాడ్‌ (కాంగ్రెస్‌), మేధా కులకర్ణి (బీజేపీ), ప్రవీణ్‌ పటేల్‌ (బీజేపీ), రవి కిషన్‌ (బీజేపీ), నిశీకాంత్‌ దూబే (బీజేపీ) నుండి ఉన్నారు.

    విద్యుత్‌ బరన్‌ మహతో (బీజేపీ), పిపి చౌదరి(బీజేపీ), మదన్‌ రాథోడ్‌ (బీజేపీ), సిఎన్‌ అన్నాదురై (డీఎంకే), దిలిప్‌ సైకియా(బీజేపీ) అవార్డు గ్రహీతల్లో ఉన్నారు. ఆర్ధికం, వ్యవసాయంపై రెండు స్టాండింగ్‌ కమిటీలను Standing Commitees కూడా అవార్డుకు ఎంపిక చేశారు. ఆర్థికంపై స్టాండింగ్‌ కమిటీకి భర్తృహరి మహతాబ్‌ నేతృత్వం వహిస్తుండగా, వ్యవసాయంపై స్టాండింగ్‌ కమిటీకి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ(కాంగ్రెస్‌) అధ్యక్షత వహిస్తున్నారు. వీరంద‌రికీ ప్రైమ్‌ పాయింట్‌ ఫౌండేషన్ సంస‌ద్ ర‌త్న అవార్డుల‌ని అంద‌జేయ‌డం జ‌రుగుతుంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...