- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | కొడుకుపై రాడ్డుతో దాడి చేసిన తండ్రి.. చికిత్స పొందుతూ మృతి

Kamareddy | కొడుకుపై రాడ్డుతో దాడి చేసిన తండ్రి.. చికిత్స పొందుతూ మృతి

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కొడుకుపై తండ్రి రాడ్డుతో దాడి చేయగా చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కామారెడ్డి(Kamareddy)లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్​ పరిధిలోని లింగాపూర్​కు చెందిన వడ్ల నిఖిల్(24) మూడు నెలల క్రితం దుబాయ్(Dubai) నుంచి తిరిగొచ్చాడు. వచ్చినప్పటి నుంచి మద్యం, గంజాయి, కల్లుకు అలవాటు పడిన నిఖిల్ ప్రతిరోజూ తల్లిదండ్రులతో గొడవపడేవాడు.

ఈ క్రమంలో సోమవారం నిఖిల్ తన తండ్రి భాస్కర్​తో గొడవకు దిగాడు. ఈ క్రమంలో తండ్రి భాస్కర్ ఇనుప రాడ్డుతో నిఖిల్​పై దాడి చేశాడు. దీంతో నిఖిల్​కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్​కు (GGH Kamareddy) తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు మృతికి కారణమైన తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News