Teachers training
Teachers training | 20 నుంచి ఉపాధ్యాయులకు రెండో విడత శిక్షణ

అక్షరటుడే, ఇందూరు​: Teachers training | ఉపాధ్యాయులకు ఈ నెల 20 నుంచి రెండో విడత శిక్షణ నిర్వహించనున్నట్లు డీఈవో అశోక్​(Deo ashok) తెలిపారు. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని సోమవారం బోర్గాం(పి) ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు విడత శిక్షణ కోసం సెంటర్​ ఇన్​ఛార్జీలు, ఆర్​పీలు సెషన్​ వారీగా అంశాలపై అవగాహన కల్పించేందుకు సిద్ధం కావాలని సూచించారు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం డైట్​ ప్రిన్సిపాల్​ శ్రీనివాస్​ మాట్లాడుతూ ట్రైనింగ్​ను సమర్థవంతంగా నిర్వహించాలని ఆర్​పీలకు సూచించారు. సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్​ శంకర్​, ఏఎంవో తదితరులు పాల్గొన్నారు.