ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​ISIS | భారీ పేలుళ్ల‌కి ఐసిస్ కుట్ర.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచ‌ల‌న విష‌యాలు

    ISIS | భారీ పేలుళ్ల‌కి ఐసిస్ కుట్ర.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచ‌ల‌న విష‌యాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :ISIS | ఆప‌రేష‌న్ సిందూర్‌(Operation Sindoor)కి ప్ర‌తీకారంగా ఐసిస్ పెద్ద స్కెచ్ వేసింది. అయితే తెలంగాణ పోలీస్(Telangana Police) అప్రమత్తతతో ఉగ్రవాదుల పెద్ద కుట్ర భగ్నం అయింది. హైదరాబాద్‌ మహానగరంలో పేలుళ్ల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా దాడులతో పాటు పేలుళ్లకు ఐసిస్ కుట్ర చేసినట్లు పోలీసులు గుర్తించారు.హైదరాబాద్‌(Hyderabad)లో భారీ పేలుళ్లకు ఐసిస్ ISIS కుట్ర చేస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఎన్‌ఐఏ, తెలంగాణ, ఏపీ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ పోలీసులు ఈ కుట్రను భగ్నం చేసినట్టు తెలిసింది. ఏపీలోని విజయనగరంలో తీగలాగితే హైదరాబాద్‌లో డొంక కదిలిందని సమాచారం. సౌదీ నుంచి ఐసిస్‌, అనుబంధ సంస్థల ప్రతినిధులు ఇస్తున్న ఆదేశాలతో ఇక్కడ కుట్రకు సన్నాహాలు చేస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించినట్టు తెలిసింది.

    ISIS | పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది..

    విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్(Siraj Ur Rehman), హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సమీర్‌(Syed Sameer) కలిసి నగరంలో భారీ పేలుళ్లకు ఫ్లాన్ చేశారు. ఇందు కోసం సిరాజ్ విజయనగరంలో Vijayanagaram పేలుడు పదార్థాలు కొనుగోలు చేశారు. ఉగ్రవాదుల పన్నాగాన్ని పసిగిట్టిన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎన్నిరోజులుగా రెక్కీ నిర్వహిస్తున్నారు. బ్లాస్ట్‌కు ఫండింగ్ చేసిందెవరు? ఎక్కడెక్కడ పేలుళ్లకు ప్లాన్ చేశారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు.హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు కుట్రపన్నిన కేసులో విచారణ వేగవంతమైంది. విజయనగరానికి చెందిన సిరాజ్‌తోపాటు, హైదరాబాద్‌లో అరెస్టు చేసిన సమీర్‌ కస్టడీ కోసం కోర్టులో ఇవాళ పిటిషన్‌ వేస్తున్నారు. ఇద్దరినీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయంటున్నారు పోలీసులు..

    ముందుగా ఈ నెల 21 లేదా 22 తేదీల‌లో విజ‌య‌న‌గ‌రంలో డ‌మ్మి బ్లాస్ట్ ప్లాన్ వేశారు. దీనిని గుర్తించిన పోలీసులు పేలుళ్ల కుట్రని భ‌గ్నం చేశారు. గ్రూప్ 2 స‌న్న‌ద్ధ‌త పేరిట హైద‌రాబాద్‌కి Hyderabad వ‌చ్చిన సిరాజ్.. గ్రూప్ 2 ప‌రీక్ష రాసేందుకు విజ‌య‌న‌గ‌రం వెళ్లాడ‌ట‌. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఏపీ పోలీసుల‌ని అల‌ర్ట్ చేశారు. సిరాజ్ ఇంటిపై దాడి చేసిన విజ‌య‌న‌గ‌రం పోలీసులు పేలుడు ర‌సాయ‌నాల‌ని స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం స‌మీర్‌ని అరెస్ట్ చేశారు. స‌మీర్‌ని ట్రాన్సిట్ వారంట్‌పై విజ‌య‌న‌గ‌రం త‌ర‌లించారు. సిరాజ్ తండ్రి, సోద‌రులంతా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ప‌ని చేస్తుంటే స‌మీర్ ఉగ్ర‌వాదం వైపు మ‌ళ్ల‌డంపై విచారిస్తున్నారు.

    More like this

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...