అక్షరటుడే, వెబ్‌డెస్క్ : pakistani spy network | పహల్గామ్లో పాశవిక దాడి చేసిన ఉగ్రవాదుల కోసం ఎన్ఐఏ బృందాలు (NIA teams) జమ్ముకశ్మీర్ అంతటా జల్లెడ పడుతున్నాయి. స్థానిక అధికారులతో కలిసి ఉత్తరకశ్మీర్‌లోని (North Kashmir) కుప్వారా, శ్రీనగర్, గడర్బాల్, బారాముల్లా వంటి 10 ప్రదేశాల్లో సోదాలు చేపట్టారు. అయితే పాకిస్థాన్ కోసం గూఢచర్యం (spying for pak) చేస్తున్న పలువురు భారతీయుల్ని అధికారులు గుర్తించి ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే హర్యానా, పంజాబ్, యూపీలో దాదాపు ఎనిమిది మంది గుఢాచారులను అదుపులోకి తీసుకోగా, అరెస్టయిన వారిలో విద్యార్థి, యూట్యూబర్, వ్యాపారవేత్త, గార్డ్ తదితరులు ఉన్నారు. తాజాగా మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.
pakistani spy network | మరొకరు అరెస్ట్..
హర్యానాలోని నుహ్(nuh)లో ఓ అనుమానితుడిని అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడు మేవాట్ జిల్లా (mewat district) టౌరు తహసీల్‌లోని కంగర్కా గ్రామానికి చెందిన మహ్మద్ తారీఫ్‌గా (mohmmad tarif) గుర్తించారు. అతడు పాక్ ఏజెంట్లకు (pakistani agents) భారత సమాచారాన్ని చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, నూహ్‌లో ఇప్పటికే ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రజక గ్రామానికి చెందని అర్మాన్‌ను గూఢచర్యం ఆరోపణలపై రెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారు. మహ్మద్ తారిఫ్ అరెస్ట్‌తో పాకిస్తాన్‌కి (pakistan) గూఢచారులుగా పని చేస్తున్న ఆరోపణలపై అరెస్ట్ అయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది.
కాగా, ఆపరేషన్ సిందూర్ (operation sindoor) తర్వాత పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా మొత్తం ఎనిమిది మంది అనుమానితుల్ని అధికారులు అరెస్ట్ (arrest) చేసి విచారిస్తున్నారు. అరెస్టయిన వారిలో గజాలా (పంజాబ్), యాసీన్ మొహమ్మద్, నోమాన్ ఇలాహి (యూపీ), 26ఏళ్ల అర్మాన్ (నుహ్), 25 ఏళ్ల దేవేంద్ర సింగ్ ధిల్లాన్ (కైతాల్), మహమ్మద్ ముర్తజా అలీ (జలంధర్), జ్యోతి మల్హోత్రా (హర్యానా యూట్యూబర్), షహజాద్ (యుపీ మొరాదాబాద్) ఉన్నారు. తాజా అరెస్ట్‌తో తొమ్మిది మంది గూఢచారులను అధికారులు అదుపులోకి తీసుకున్నట్లైంది. వీరంతా పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISI కోసం పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు.