అక్షరటుడే నిజాంసాగర్: Nizamsagar | ఫోన్ మాట్లాడవద్దని తండ్రి మందలించడంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై శివకుమార్ (SI Shiva kumar) తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన కొంకుల రాకేశ్(20) ఇసుక లారీపై పని చేస్తుండేవాడు. తల్లిదండ్రులు గంగారాం, పోచవ్వ బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్కు (Hyderabad) వలస వెళ్లారు. శనివారం రాత్రి ఇంటికి వచ్చిన గంగారాం తన కొడుకు తరచూ ఫోన్లల్లో ఎక్కువ సేపు మాట్లాడుతుండడంతో మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన రాకేశ్ సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
