CPM Armoor
CPM Armoor | పుచ్చలపల్లి సుందరయ్య ఆశయసాధనకు కృషి చేయాలి

అక్షరటుడే, ఆర్మూర్: CPM Armoor | పుచ్చలపల్లి సుందరయ్య (Puchalapalli Sundarayya) ఆశయ సాధనకు కృషి చేయాలని సీపీఎం ఆర్మూర్​ డివిజన్ (CPM Armoor Division)​ కార్యదర్శి పల్లపు వెంకటేశ్​ పేర్కొన్నారు. సోమవారం ఆయన వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భూస్వాముల నుంచి 10 లక్షల ఎకరాలు స్వాధీనం చేసుకుని పేదలకు పంచిన ఘనత ఆయనదని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య, డివిజన్ కమిటీ సభ్యులు జక్కం సుజాత, భూమన్న, రవి, కుల్దీప్ శర్మ, ఓం నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇందూరులో..

నగరంలో సీపీఎం పార్టీ కార్యాలయంలో నినాదాలు చేస్తున్న కార్యకర్తలు

అక్షరటుడే, ఇందూరు: కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి యువతకు, రాజకీయ నాయకులకు ఆదర్శమని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌ బాబు అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో సుందరయ్య వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య పాత్ర, భూపోరాటాలు, సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో కార్యదర్శి సుజాత, కమిటీ సభ్యులు రాములు, నర్సయ్య, ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి లింగం, తదితరులు పాల్గొన్నారు.

గాంధారి మండల కేంద్రంలో..

మండల కేంద్రంలో నినాదాలు చేస్తున్న సీపీఎం కార్యకర్తలు

అక్షరటుడే,గాంధారి: మండల కేంద్రంలో తెలంగాణ సాయిధ పోరాట వీరుడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మోతీరాం నాయక్​ మాట్లాడుతూ 12ఏళ్ల వయస్సు నుంచి కులవివక్ష దోపిడీని ఎదిరించిన ధీరుడు సుందరయ్య అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి సరాబ్ కిషన్ రావు, మధు, గిరిజన సంఘం కార్యదర్శి ప్రకాష్, సాయిలు, వసంత్​రావు, రాములు, స్వప్న సాయవ్వ తదితరులు పాల్గొన్నారు.