ePaper
More
    Homeక్రీడలుOperation Sindoor | ఆప‌రేష‌న్ సిందూర్ స‌మ‌యంలో నా పేరెంట్స్ పీఓకేలో ఉన్నారు.. చాలా భ‌య‌ప‌డ్డాన‌న్న...

    Operation Sindoor | ఆప‌రేష‌న్ సిందూర్ స‌మ‌యంలో నా పేరెంట్స్ పీఓకేలో ఉన్నారు.. చాలా భ‌య‌ప‌డ్డాన‌న్న క్రికెట‌ర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Operation Sindoor | ప‌హ‌ల్​గామ్​ ఉగ్ర‌దాడి(Pahalgam terror attack)కి వ్య‌తిరేకంగా భార‌త సైన్యం ఆప‌రేష‌న్ సిందూర్ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఆప‌రేషన్ సిందూర్ త‌ర్వాత పాక్(Pakistan) కూడా మ‌న‌పై దాడుల‌కు దిగింది. దానిని భార‌త సైన్యం (India army) తిప్పి కొట్ట‌డం మ‌నం చూశాం. అయితే ఆ స‌మయంలో చాలా మంది భ‌యాందోళ‌న‌ల‌కి గుర‌య్యారు. పాకిస్థాన్​పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇంగ్లండ్ క్రికెట‌ర్ మొయిన్ అలీ(England cricketer Moeen Ali) భారత్​లోనే ఉండి కోల్​కతాకు ఆడుతున్నాడు. మొయిన్ తల్లిదండ్రులు మాత్రం ఆ సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో ఉన్నారట. పీవోకేలోని ఉగ్ర శిబిరాలపై భారత దాడులు చేస్తుండడంతో తాను తీవ్ర ఆందోళన చెందినట్లు చెప్పాడు.

    Operation Sindoor | చేదు అనుభ‌వాలు..

    భార‌త్, పాక్ ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా తొమ్మిది రోజుల పాటు నిలిచిపోయిన ఐపీఎల్(IPL) 2025 శ‌నివారం (మే 17న‌) పునఃప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ లీగ్‌లో ఆడేందుకు భార‌త్‌కు రాని అతికొద్ది మంది అంత‌ర్జాతీయ క్రికెట‌ర్ల‌లో ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ మొయిన్ అలీ Moeen Ali ఒక‌డు. ఆయ‌న ఆప‌రేష‌న్ సిందూర్(Operation Sindoor) గురించి తాజాగా మాట్లాడుతూ ఆ స‌మ‌యంలో త‌న త‌ల్లిదండ్రులు పీఓకే(POK)లో ఉన్న‌ట్లు మొయిన్ చెప్పాడు. వారున్న చోటు నుంచి గంట ప్ర‌యాణ దూరంలోనే దాడులు జ‌రిగాయ‌ని తెలిపాడు. అయితే అదృష్ట‌వ‌శాత్తు త‌న త‌ల్లిదండ్రులు ఉన్న ప్రాంతంలో ఎలాంటి క్షిప‌ణి దాడులు జ‌ర‌గ‌లేద‌న్నాడు. వెంట‌నే వారు అందుబాటులో ఉన్న విమానం ఎక్కి ఆ ప్రాంతాన్ని వీడారు. వారు క్షేమంగా రావ‌డంతో ఊపిరి పీల్చుకున్న‌ట్లుగా మొయిన్ చెప్పాడు.

    కోల్​కతాకు ఆడుతున్న మొయిన్ అలీ(Moeen Ali) లీగ్ వాయిదాతో ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. బహుశా పరిస్థితుల కారణంగా అతడు తిరిగి రాలేదని అనుకోవ‌చ్చు. మొయిన్ కుటుంబం క్రికెట్​ను బాగా ఇష్టపడుతుంది. ఇతడి నలుగురు సమీప బంధువులు(ఇద్దరు కజిన్స్, ఇద్దరు సోదరులు) క్రికెటర్లే కావడం గమనార్హం. ఇక మొయిన్ అలీ తాత ప్రస్తుత పీవోకేలోని మీర్పూర్ నుంచి ఇంగ్లండ్ England వెళ్లి స్థిరపడ్డారు. అక్కడే బ్రిటిషర్​ను పెళ్లాడారు. మొయిన్.. బర్మింగ్ హామ్​లో పుట్టాడు. మొయిన్ అలీ పూర్వీకులు ప్ర‌స్తుత పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో ఉన్న మీర్పూర్ ప్రాంతానికి చెందిన వారు. కాగా.. అత‌డి తాత చిన్న‌త‌నంలోనే ఇంగ్లాండ్ కు వ‌ల‌స‌వెళ్లి అక్క‌డే స్థిర‌ప‌డ్డాడు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...