అక్షరటుడే, బోధన్: Bodhan Police | ఆకతాయిల ఆగడాలు అరికట్టేందుకే ఫుట్ పెట్రోలింగ్(Foot patroling) నిర్వహిస్తున్నట్లు సీఐ వెంకట నారాయణ (CI Venkat narayana) తెలిపారు. సోమవారం ఉదయం పట్టణంలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ప్రజలకు పోలీసులు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో కాలనీల్లో పెట్రోలింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. గంజాయి, మత్తుపదార్థాలు వినియోగించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఐ వెంట మహిళా ఎస్సై, పోలీసు సిబ్బంది తదితరులున్నారు.
