ePaper
More
    HomeతెలంగాణCyberabad Police | వీకెండ్​లో డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు.. ఎంతమంది చిక్కారంటే..

    Cyberabad Police | వీకెండ్​లో డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు.. ఎంతమంది చిక్కారంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Cyberabad Police | హైదరాబాద్​ నగరంలో మద్యం ప్రియులకు ట్రాఫిక్​ పోలీసులు(Traffic police) షాక్​ ఇస్తున్నారు. వారాంతంతో దోస్తులతో కలిసి మందు వేసి ఇంటికి వెళ్దామనుకునే వారిపై కొరఢా ఝళిపిస్తున్నారు. హైదరాబాద్(Hyderabad)​ మహా నగరంలో నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. వీటిలో ఎక్కువ శాతం మద్యం తాగి డ్రైవ్​ చేయడంతో జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో మందుబాబులు రెచ్చిపోయి తాగుతున్నట్లు గుర్తించి చర్యలు చేపట్టారు.

    Cyberabad Police | వారాంతంలో స్పెషల్​ డ్రైవ్​

    రోడ్డు ప్రమాదాల నివారణకు సైబరాబాద్​ పోలీసులు(Cyberabad Police) చర్యలు చేపట్టారు. డ్రంకన్​ డ్రైవ్(Drunk Driving)​ చేస్తున్న వారి కోసం శని, ఆదివారాల్లో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 306 మందిని పోలీసులు అరెస్ట్​(Police Arrest) చేశారు. ఇందులో 246 ద్విచక్ర వాహనాలు, 9 త్రిచక్ర వాహనాలు, 50 నాలుగు చక్రాల వాహనాలు, ఒక భారీ వాహనం ఉన్నాయి. నిందితుల్లో ఎక్కువ మంది 21 నుంచి 40 ఏళ్లలోపు వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు.

    More like this

    YS Jagan | చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డ జగన్​.. ప్రభుత్వం ఉందా అని ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandra Babu)...

    India-Pakistan | మ‌రో నాలుగు రోజుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. ఇంకా అమ్ముడుపోని టిక్కెట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-Pakistan | అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో హై వోల్టేజ్‌గా పేరొందిన భారత్ vs పాకిస్తాన్...

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...