ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Tirumala | శ్రీవారికి భారీ వెండి అఖండాల విరాళం

    Tirumala | శ్రీవారికి భారీ వెండి అఖండాల విరాళం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Tirumala | తిరుమల(tirumala)లో కొలువుదీరిన కలియుగ దైవం వేంకటేశ్వర స్వామికి దాదాపు 300 ఏళ్ల తర్వాత అఖండాలను విరాళం ఇచ్చారు. తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత mysore rajamatha ప్రమోదా దేవి pramoda devi రెండు భారీ వెండి అఖండాల(అఖండ దీపాలు)ను సోమవారం విరాళంగా అందించారు. ఇవి గర్భగుడిలో వెలిగించే సంప్రదాయ దీపాలు. సుమారు 300 సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు మహారాజు mysore king ఇలాంటి దీపాలను ఆలయానికి విరాళం ఇచ్చినట్లు చరిత్రలో ఉంది. ఇప్పుడు మళ్లీ మైసూరు రాజమాత వాటిని సమర్పించడం విశేషం. ఒక్కో వెండి అఖండం సుమారు 50 కిలోల బరువుంటుంది. తిరుమలలోని రంగనాయకుల మండపం Ranganayakula Mandapamలో ఆమె ఈ భారీ వెండి అఖండాలను టీటీడీ TTD కి అందించారు. కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.

    More like this

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...

    Ramareddy mandal | యూరియా కోసం రైతుల బారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy mandal | రామారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం (society office) వద్ద యూరియా...