ePaper
More
    HomeజాతీయంYouTuber Jyoti Malhotra | ఐఎస్‌ఐ ఏజెంట్‌తో రిలేష‌న్ షిప్.. యూట్యూబ‌ర్‌ జ్యోతి మ‌ల్హోత్రా కేసులో...

    YouTuber Jyoti Malhotra | ఐఎస్‌ఐ ఏజెంట్‌తో రిలేష‌న్ షిప్.. యూట్యూబ‌ర్‌ జ్యోతి మ‌ల్హోత్రా కేసులో విస్తుపోయే విష‌యాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :YouTuber Jyoti Malhotra | పాకిస్థాన్‌ Pakistanకు గోప్యమైన సమాచారం లీక్ చేసిందన్న ఆరోపణలపై హర్యానా హిసార్‌కు చెందిన ట్రావెలర్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(YouTuber Jyoti Malhotra)ని పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాకిస్థాన్‍‌కు సీక్రెట్ సమాచారం పంపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో విచారణలో భాగంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జ‌మ్మూకశ్మీర్‌లోని ప‌హ‌ల్గామ్‌లో జ‌రిగిన ఉగ్ర‌దాడి(Terror Attack)కి కొన్ని నెల‌ల ముందు ఆమె అక్క‌డికి వెళ్లిన‌ట్లు ద‌ర్యాప్తులో నిర్ధార‌ణ అయింది. అలాగే పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న ఆ దేశ హైక‌మిష‌న్ ఉద్యోగి డానిష్‌(High Commission employee Danish)తో ఆమెకు స‌న్నిహిత సంబంధాలున్న‌ట్లు తేలింది.

    YouTuber Jyoti Malhotra | దేశ ద్రోహి..

    ఐఎస్‌ఐ ఏజెంట్ ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో పరిచయం పెంచుకుంది. అది కాస్తా శారీరక సంబంధం దాకా వెళ్లింది. వాడి మాయమాటల్లో పడి దేశద్రోహానికి ఒడిగట్టింది. వాట్సప్‌, ఎన్‌క్రిప్ట్‌డ్‌ మెస్సేజ్‌ల ద్వారా ద్వారా భారత సైనిక స్థావరాల సమీప రహదారులు, ఆయుధ నిల్వల వివరాలను డానిష్‌కు పంపిందీ దేశద్రోహి. ఆమెకు చెందిన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించ‌గా ఓ వీడియోలో ఢిల్లీలోని పాక్ ఎంబసీలో డానిష్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో జ్యోతి మల్హోత్రా పాల్గొన్నట్టు క‌నిపించింది. ఈవెంట్‌లోనే పాకిస్థాన్ జాతీయ దినోత్సవం గురించి జ్యోతి మల్హోత్రా, డానిష్ మాట్లాడుకుంటున్నట్టు ఉంది. గతంలో పహల్గామ్‌లో కూడా జ్యోతి మల్హోత్రా (Jyoti malhotra) పర్యటించింది..

    అయితే.. పహల్గామ్ ఉగ్ర దాడి వెనుక జ్యోతి మల్హోత్రా పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. యూట్యూబర్ ముసుగులో దేశ రహస్యాలను జ్యోతి ఎలా చేరవేసింది..? ఈ నెట్ వర్క్‌లో ఎవరెవరు ఉన్నారు అన్న దానిపై పోలీసులు.. మొత్తం ఆరాతీస్తున్నారు. మొత్తంగా పాక్‌ ఐఎస్‌ఐ ఏజెంట్లు(Pakistan ISI agents) ఆమెను ఒక అస్త్రంగా మలచుకున్నారని హర్యానా పోలీసులు గుర్తించారు. ఆమె ప‌లుమార్లు పాకిస్థాన్‌లో ప‌ర్య‌టించింద‌ని, ఒక‌సారి చైనాకు కూడా వెళ్లొచ్చిన‌ట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఆప‌రేష‌న్ సిందూర్(Operation Sindoor) అనంత‌రం నెల‌కొన్న ఉద్రిక్త‌తల స‌మ‌యంలో ఆమె ఢిల్లీలోని పాక్ ఎంబ‌సీలోని అధికారి డామిష్‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్లు నిర్ధారించారు. జ్యోతిని అత‌డు ట్రాప్ చేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు. జ్యోతి మల్హోత్రాతో ఒడిశాలోని పూరిలో ఉన్న ఓ యూట్యూబర్‌కు (Youtuber) సంబంధాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జ్యోతి గ‌తేడాది సెప్టెంబరులో పూరి వచ్చి, ఓ మహిళా యూట్యూబర్‌ను కలిసింది. పూరి మహిళ కూడా పాకిస్థానీ నిఘా వర్గాలకు మన దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఇచ్చిందా? అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెపై అధికార రహస్యాల చట్టం, జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదయ్యాయి.

    More like this

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...

    Ramareddy mandal | యూరియా కోసం రైతుల బారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy mandal | రామారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం (society office) వద్ద యూరియా...