ePaper
More
    HomeసినిమాManchu Manoj | ఆ వీడియో చూసి క‌న్నీళ్లు పెట్టుకున్న మంచు మ‌నోజ్

    Manchu Manoj | ఆ వీడియో చూసి క‌న్నీళ్లు పెట్టుకున్న మంచు మ‌నోజ్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Manchu Manoj | మంచు మోహన్ బాబు (Mohan babu) వార‌సుడు మనోజ్ తాజాగా న‌టించిన చిత్రం భైర‌వం. యాక్షన్ థ్రిల్లర్ గా తెర‌కెక్కిన స‌ మూవీ ఈ నెల 30న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

    తమిళ దర్శకుడు శంకర్ కుమార్తె ఆదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై, శరత్ లోహితాశ్వ, అజయ్, సందీప్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ (Sri Sathya Sai Arts Banner) కింద కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు. విజయ్ కనకమేడల దర్శకుడు. తమిళం సూపర్ హిట్ అయిన గరుడన్ కు రీమేక్ గా ఈ మూవీని తెర‌కెక్కించార‌నే టాక్ న‌డుస్తుంది. అయితే తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల కార్యక్ర‌మం జ‌రిగింది. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే.. రూరల్ బ్యాక్ గ్రౌండ్ లో వారాహి అమ్మవారి ఆలయం ప్రధానాంశంగా సినిమా తెరకెక్కిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

    Manchu Manoj | ఫుల్ ఎమోష‌న‌ల్..

    ఇక ఈవెంట్‌లో మ‌నోజ్ (Manchu manoj) అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. ఈవెంట్‌లో ఆయ‌న‌పై ఓ వీడియో (ఏవీ) ప్ర‌ద‌ర్శించారు. అది చూసి మంచు మ‌నోజ్ చ‌లించిపోయాడు. ఎమోష‌న్ ఆపుకోలేక క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. మోహన్ బాబు, విష్ణుతో ఆస్తి తగాదాలు, పోలీస్ కేసులు, కోర్టు చుట్టూ తిరగడం వంటి పరిస్థితుల మధ్య ఈ సినిమాను పూర్తి చేశాడు. ఆరు సంవత్సరాల గ్యాప్ తరువాత మళ్లీ తెర మీదికి రావడానికి ప్రేక్షకుల ప్రేమాభిమానాలు, జనం ఆదరణే కారణమని చెప్పుకొచ్చాడు. సొంత‌వాళ్లే దూరం పెడుతున్న ఈ రోజుల్లో అభిమానులు త‌న‌పై ప్రేమ కురిపిస్తున్నార‌ని ఎమోష‌న్ అయ్యాడు. మ‌నోజ్‌ని ఓదారుస్తున్నా కూడా కంట్రోల్ చేసుకోలేక‌పోయాడు.

    ఇక మనోజ్(Manchu Manoj) మాట్లాడుతూ.. “తొమ్మిదేళ్లు గ్యాప్ ఇచ్చాను. కొత్త సినిమాను స్టార్ట్ చేశాను. రీ లాంచ్ అనుకున్నాను. కరోనా(Corona) వచ్చింది. ఆ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. మనం ఏదో అనుకుంటాం. కానీ దేవుడు ఇంకేదో అనుకుంటాడు. తొమ్మిదేళ్లు గ్యాప్ ఇచ్చినా కూడా మీ ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. అసలు ఒక రెండు సంవత్సరాలు సినిమాలు చేయకపోతేనే పట్టించుకోవడం లేదు. కానీ, నేను 9 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాను. అయినా మీరు నన్ను ఇంకా అలానే ప్రేమిస్తున్నారు.. భైరవం (Bhairavam) ప్రయాణంలో నాకు పర్సనల్‌గా ఎన్నో సమస్యలు వచ్చాయి.. ఒక రోజు వేరే ఊరికి వెళ్లొచ్చే సరికి కట్టుబట్టలతో సహా బయటకు పంపించేశారు. నా కారుని ఎత్తుకెళ్లారు. అయినా నేను బాధపడలేదు. ఒక కారు పోతే.. నా కోసం అభిమానులు 20 కార్లు తెచ్చి పెట్టి రెడీగా ఉంచారు. ఆ ప్రేమను ఎవ్వరూ తీసుకెళ్లలేరు. డబ్బులిచ్చి ప్రమోట్ చేసుకుంటున్న ఈ టైంలో నేను ఒక్క రూపాయి ఇవ్వకుండా కూడా నా వైపు న్యాయం నిల్చుంది. ఇక సోషల్ మీడియాలో స్ట్రైక్స్ అని బెదిరిస్తున్నా. మీ యూట్యూబ్ చానెళ్లను మూయిస్తున్నా. ధైర్యంగా నాకోసం నిలబడుతున్నారు..” అని మనోజ్ భావోద్వేగంతో మాట్లాడారు. కాగా.. ఈ చిత్రం మే 30న రిలీజ్ రాబోతోంది.

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...