Travis-Head
IPL 2025 | ఐపీఎల్‌కి కరోనా సెగ‌.. స్టార్ ప్లేయ‌ర్ కోవిడ్ బారిన ప‌డ‌డంతో…

అక్షరటుడే, వెబ్​డెస్క్ :IPL 2025 | భార‌త్ -పాక్(India-Pakistan) యుద్ధ నేప‌థ్యంలో కొద్ది రోజుల పాటు ఐపీఎల్‌కి IPL బ్రేక్ ప‌డిన విష‌యం తెలిసిందే. ఇక మే 17 నుండి మొద‌లు కాగా, క‌రోనా సెగ త‌గిలింది.

ఐపీఎల్ 2025లో పేలవ ప్రదర్శన చేసి ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad)కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ ట్రావిస్ హెడ్‌(Travis Head)కు కరోనా(Corona) సోకింద‌నే విషయాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ డేనియల్ వెటోరీ(Daniel Vettori) చెప్పాడు. ప్రస్తుతం హెడ్ ఆస్ట్రేలియాలోనే ఉన్నాడని , అతడు ఎప్పుడు భారత్ వస్తాడనే విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదని వ్యాఖ్యానించాడు.

IPL 2025 | క‌రోనా ఎఫెక్ట్..

స‌న్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) లీగ్‌లో తన తర్వాతి మ్యాచులో ఈనెల 19న అంటే సోమవారం Monday లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని స్టేడియంలో జరగనుంది. అయితే లీగ్‌ను ఒక వారం పాటు నిలిపివేయగా, ఆ సమయంలో చాలామంది విదేశీ క్రికెటర్లు తమ తమ దేశాలకు వెళ్లిపోయారు. టోర్నీ(Tournament) పునఃప్రారంభాన్ని ప్రకటించిన తర్వాత మిచెల్ స్టార్క్, జేక్ ఫ్రేసర్-మర్క్ లాంటి ఆటగాళ్లు మిగతా మ్యాచ్‌లకు దూరంగా ఉండేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, కగిసో రబాడా, ట్రిస్టన్ స్టబ్‌లు తమ జట్లకు తిరిగి చేరనున్నారు.

అయితే హెడ్ Travis head ఇటీవల కోవిడ్ బారిన పడ్డాడు, అందుకే ప్రయాణం ఆలస్యమైంది. భారత్‌కు వచ్చిన తర్వాత అతని ఆరోగ్య స్థితిని పరిశీలించి, మిగతా మ్యాచ్‌ల్లో అతడి పాల్గొనగలగడాన్ని నిర్ణయిస్తాము” అని డానియేల్ వెటోరి తెలిపారు. సన్ రైజర్స్ హైదరాబాద్ తన చివరి మూడు మ్యాచ్ లను లక్నో (మే 19న).. ఆర్సీబీ (మే 23న), కేకేఆర్ (మే 25న) జట్లతో ఆడనుంది. మ‌రి వీటిలో ఏ మ్యాచ్‌కి హెడ్ అందుబాటులో ఉంటాడ‌నే దానిపై ప‌క్కా క్లారిటీ లేదు.

ఇక హెడ్(Head) ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 281 పరుగులు నమోదు చేసిన హెడ్, 28.01 సగటుతో, 156.11 స్ట్రైక్ రేట్‌తో రాణించాడు.ట్రావిస్ హెడ్‌ను జూన్ 11న లండన్‌లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడే ఆస్ట్రేలియా జట్టులో ఎంపిక చేశారు. డబ్ల్యూటీసీ టైటిల్ నిల‌బెట్టుకోవడం కోసం ఆస్ట్రేలియా సిద్ధ‌మ‌వుతుంది. ఇలాంటి స‌మ‌యంలో హెడ్ క‌రోనా బారిన ప‌డ‌డం వారిని ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఆయ‌న త్వ‌ర‌గా తిరిగి కోలుకోవాలని ఆస్ట్రేలియ‌న్స్ తో పాటు స‌న్‌రైజ‌ర్స్ అభిమానులు కోరుకుంటున్నారు.