ePaper
More
    Homeఅంతర్జాతీయంJoe Biden | బైడెన్‌కు ప్రొస్టేట్ క్యాన్స‌ర్‌.. కోలుకోవాల‌ని ఆకాంక్షించిన ట్రంప్‌

    Joe Biden | బైడెన్‌కు ప్రొస్టేట్ క్యాన్స‌ర్‌.. కోలుకోవాల‌ని ఆకాంక్షించిన ట్రంప్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Joe Biden | అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్(Former US President Joe Biden) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

    82 ఏళ్ల వయస్సులో ఆయ‌న ప్రోస్టేట్ క్యాన్సర్‌(Prostate Cancer)తో బాధ ప‌డుతున్న‌ట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధి ఎముక‌ల‌కు వ్యాపించడంతో మెటాస్టాటిక్ ప్రోస్టేట్ క్యాన్సర్‌గా గుర్తించారు. ఈ క్యాన్సర్ హార్మోన్ సెన్సిటివ్‌గా ఉండడం వల్ల చికిత్సకు అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నారు. జో బైడెన్‌కు ఇటీవల జరిగిన రోటిన్ హెల్త్ చెక‌ప్‌లో భాగంగా మూత్ర సంబంధిత సమస్యలు వెలుగులోకి వచ్చాయి. వీటి ఆధారంగా ప్రోస్టేట్ నోడ్యూల్‌ను గుర్తించారు. బయాప్సీ ద్వారా గ్లీసన్ స్కోర్ 9 (గ్రూప్ 5)తో ఉన్న క్యాన్సర్‌ను నిర్ధారించారు.

    Joe Biden | త్వ‌ర‌గా కోలుకోవాల‌న్న ట్రంప్‌..

    బైడెన్ అనారోగ్యంపై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) స్పందించారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. ఈ మేర‌కు త‌న సోషల్ మీడియా ట్రూత్ వేదికగా స్పందించారు. జో బైడెన్(Joe Biden) ఆరోగ్య ప‌రిస్థితి తెలిసి మెలానియా, నేను బాధపడ్డామన్నారు. ఈ సందర్భంగా బైడెన్ కుటుంబానికి సానుభూతి తెలిపిన ట్రంప్‌.. ఆయ‌న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

    Joe Biden | రేడియోథ‌ర‌పీ చేసే అవ‌కాశం

    ప్రస్తుతం బైడెన్ వైద్య బృంద హార్మోన్ థెరపీ(Hormone Therapy), రేడియేషన్ థెరపీ(Radiation Therapy) వంటి చికిత్సా మార్గాలను పరిశీలిస్తోంది. హార్మోన్ సెన్సిటివ్ క్యాన్సర్‌కి చికిత్సలు సాధారణంగా సమర్థవంతంగా ఉంటాయి. అయితే, మెటాస్టాటిక్ ప్రోస్టేట్ క్యాన్సర్‌కు పూర్తిగా కోలుకునే చికిత్సలు లేవు, కానీ సరైన వైద్య నిర్వహణతో తీవ్ర‌తను త‌గ్గించుకోవ‌చ్చు.

    గత వారం కూడా, బైడెన్ ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. అతని మూత్ర సమస్యలు తీవ్రమైన తర్వాత, అతని ప్రోస్టేట్ నాడ్యూల్‌ను తిరిగి పరీక్షించగా, ఆ వ్యాధి అతని ఎముకలకు వ్యాపించిందని తేలింది. బైడెన్ కార్యాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఈ వ్యాధి మరింత ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇది హార్మోన్ సెన్సిటివ్ అని చెబుతున్నారు.

    Joe Biden | పురుషుల్లో ఎక్కువ‌..

    ప్రోస్టేట్ క్యాన్సర్ సాధారణంగా వృద్ధులను ప్రభావితం చేస్తుంది. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా యువతలో కూడా దీని తీవ్ర‌ పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం 2022లో దాదాపు 37,948 మంది భారతీయ పురుషులు ప్రోస్టేట్ క్యాన్సర్‌(Prostate Cancer)తో బాధ పడుతున్నట్లు గుర్తించారు. ఈ సంవత్సరం మ‌న దేశంలో నమోదైన 14 లక్షల కొత్త క్యాన్సర్ కేసుల్లో ఇది దాదాపు మూడు శాతం.

    USలో 80 శాతం ప్రోస్టేట్ క్యాన్సర్ రోగులలో ముందుగానే నిర్ధారణ అవుతుండగా, ఆలస్యంగా నిర్ధారణ కేవలం 20 శాతం కేసులలో మాత్రమే జరుగుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్‌ను గుర్తించడానికి ప్రస్తుతం ఖచ్చితమైన, నమ్మదగిన మార్గం లేదని క్యాన్సర్ రీసెర్చ్ UK నిపుణుడు నాసర్ తురాబి అన్నారు.

    Latest articles

    Yuva Pro Kabaddi League | యువ ప్రో కబడ్డీ లీగ్​లోని జట్టుకు కోచ్​గా ప్రశాంత్

    అక్షరటుడే, ఇందూరు: Yuva Pro Kabaddi League | తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ (Telangana Kabaddi Association) సహకారంతో...

    NHAI Notification | డిగ్రీ అర్హతతో ఎన్‌హెచ్‌ఏఐలో ఉద్యోగావకాశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : NHAI Notification | పలు పోస్టుల భర్తీ కోసం నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌...

    Pocharam Bhaskar Reddy | మీడియా లేనిదే ప్రపంచం లేదు.. పోచారం భాస్కర్ రెడ్డి

    అక్షరటుడే, కోటగిరి: Pocharam Bhaskar Reddy | మీడియా (Media) లేనిదే ప్రపంచం లేదని ఉమ్మడి జిల్లా డీసీసీబీ...

    Roja | జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై ఎమ్మెల్యే వ్యాఖ్యల వివాదం… రోజా గట్టి కౌంటర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Roja | టాలీవుడ్ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్(Jr. Ntr)పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు,...

    More like this

    Yuva Pro Kabaddi League | యువ ప్రో కబడ్డీ లీగ్​లోని జట్టుకు కోచ్​గా ప్రశాంత్

    అక్షరటుడే, ఇందూరు: Yuva Pro Kabaddi League | తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ (Telangana Kabaddi Association) సహకారంతో...

    NHAI Notification | డిగ్రీ అర్హతతో ఎన్‌హెచ్‌ఏఐలో ఉద్యోగావకాశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : NHAI Notification | పలు పోస్టుల భర్తీ కోసం నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌...

    Pocharam Bhaskar Reddy | మీడియా లేనిదే ప్రపంచం లేదు.. పోచారం భాస్కర్ రెడ్డి

    అక్షరటుడే, కోటగిరి: Pocharam Bhaskar Reddy | మీడియా (Media) లేనిదే ప్రపంచం లేదని ఉమ్మడి జిల్లా డీసీసీబీ...