ePaper
More
    HomeజాతీయంSpying for Pakistan | పాకిస్థాన్ కోసం గూఢచర్యం.. వ్యాపారవేత్త అరెస్ట్

    Spying for Pakistan | పాకిస్థాన్ కోసం గూఢచర్యం.. వ్యాపారవేత్త అరెస్ట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Spying for Pakistan | పాకిస్తాన్​ pakistan కు భారత రహస్య సమాచారాన్ని చేరవేస్తున్న ఓ వ్యాపారిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఏప్రిల్​ 22న జరిగిన పహల్గామ్​ ఉగ్రదాడి pahalgam terror attack లో 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిఘా వైఫల్యం ఉందని కేంద్రం అంగీకరించింది. అనంతరం భారత నిఘా వర్గాలు intelligence agencies అప్రమత్తం అయ్యాయి. భారత్​ ఆపరేషన్ సిందూర్ Operation Sindoor​ చేపట్టడంతో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని భావించి అనుమానితులపై నిఘా పెట్టాయి. ఈ క్రమంలో భారత్​కు చెందిన పలువురు పాకిస్తాన్​కు గూఢచారులుగా పనిచేస్తున్నట్లు గుర్తించాయి. ఇప్పటికే పలువురిని అరెస్ట్​ చేయగా తాజాగా ఉత్తరప్రదేశ్​లోని రాంపూర్‌కు చెందిన వ్యాపారవేత్త షాజాద్‌ Businessman Shahzad ను పోలీసులు అరెస్ట్​ చేశారు.

    Spying for Pakistan | ఐఎస్​ఐతో సంబంధాలు

    వ్యాపారవేత్త షాజాద్​కు పాకిస్తాన్​ నిఘా సంస్థ ఐఎస్​ఐ ISIతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. గూఢచర్యం పంచుకునేందుకు షాజాద్ పలుమార్లు పాక్ వెళ్లొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గూఢచర్యంతోపాటు పాక్‌కు స్మగ్లింగ్‌ (Smuggling) చేస్తున్నాడనే సమాచారంతో అతని కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు.. అతడిని మొరాబాద్‌ Morabadలో అరెస్ట్​ చేశారు. దేశ భద్రతకు సంబంధించిన పలు సమాచారాన్ని షాజాద్​ ఐఎస్ఐకి చేరవేసినట్లు అధికారులు తెలిపారు.

    Spying for Pakistan | ఐఎస్​ఐ రిక్రూట్​మెంట్​కు సాయం

    షాజాద్​ కాస్మొటిక్స్‌, దుస్తులు, సుగంధ ద్రవ్యాలను అక్రమంగా సరిహద్దులు దాటించాడని అధికారులు తెలిపారు. స్మగ్లింగ్‌తో పాటు గూఢచర్యానికి పాల్పడినట్లు వివరించారు. ఐఎస్‌ఐ ఏజెంట్లకు డబ్బుతోపాటు సిమ్‌కార్డులు కూడా అందించాడని దర్యాప్తులో తేలిందన్నారు. పాక్‌ నిఘా సంస్థ కోసం రిక్రూట్‌మెంట్‌ కోసం సాయం చేశాడని తెలిపారు. దీనిలో భాగంగా యూపీలోని రామ్‌పూర్‌తోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారిని పాకిస్తాన్​కు పంపించాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

    Spying for Pakistan | క‌ల‌క‌లం రేపుతున్న అరెస్టులు

    ఏప్రిల్ 22న కాశ్మీర్‌లోని పహల్ గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప‌ర‌స్ప‌ర దాడులతో యుద్ధ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. అయితే, కాళ్ల భేరానికి వ‌చ్చిన పాక్ కాల్పుల విర‌మ‌ణ‌కు ప్ర‌తిపాదించ‌డంతో భార‌త్ అంగీక‌రించింది. అయితే, దీని త‌ర్వాత ఉగ్ర‌వాద కార్య‌కాల‌పాల‌పై ద‌ర్యాప్తు సంస్థ‌లు నిఘా పెట్ట‌గా, అనేక మంది ఇండియాలో ఉంటూ ఐఎస్ఐ కోసం ప‌ని చేస్తున్నారని గుర్తించారు. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల హిస్సార్‌కు చెందిన యూట్యూబ‌ర్ జ్యోతి మ‌ల్హోత్రాను అరెస్టు చేయ‌గా, తాజాగా యూపీలో షాజాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. మ‌రికొంద‌రిని కూడా అరెస్టు చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...