ePaper
More
    Homeక్రైంVijayanagarm | కారు డోర్​ లాక్​.. నలుగురు చిన్నారుల మృతి

    Vijayanagarm | కారు డోర్​ లాక్​.. నలుగురు చిన్నారుల మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijayanagarm | ఆంధ్రప్రదేశ్​ APలోని విజయనగరం Vijayanagarm జిల్లాలో విషాదం నెలకొంది. కారు డోర్​ లాక్ car door lock​ కావడంతో నలుగురు చిన్నారులు మృతి చెందారు. విజయనగరం జిల్లాలోని ద్వారంపూడి dwarampood లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో మహిళా మండల కార్యాలయం వద్ద ఆగి ఉన్న ఒక కారులో సరదాగా కూర్చునేందుకు వెళ్లి చిన్నారులు డోర్​ వేసుకున్నారు. దీంతో కారు డోర్ లాక్ పడడంతో ఊపిరి ఆడక నలుగురు మృతి చెందారు.

    మంగి బుచ్చిబాబు, భవాని దంపతుల కుమారుడు ఉదయ్ (8), బుర్లు ఆనంద్ ఉమా దంపతుల ఇద్దరు కుమార్తెలు చారుమతి (8), చరిష్మా (6), కంది సురేష్ అరుణ దంపతుల కుమార్తె మనస్విని మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు చిత్తూరు chittoor జిల్లా కుప్పం kuppam మండలంలోని దేవరాజుపురంలో నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఆడుకోవడానికి వెళ్లిన గౌతమి(7), శాలిని(6), అశ్విన్​(7) ప్రమాదవశాత్తు కుంటలో పడి మరణించారు.

    కాగా ఇటీవల రంగారెడ్డి rangareddy జిల్లాలో సైతం ఓ చిన్నారి కారులో ఊపిరాడక చిన్నారి మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా మక్తమాదారం గ్రామంలో ఆడుకుంటూ ఇంటి ఎదుట నిలిపి ఉన్న కార్లోకి ఎక్కి డోర్ అక్షయ డోర్​ వేసుకుంది. డోర్​ ఓపెన్​ కాకపోవడంతో ఊపిరాడక కారులోనే మృతి చెందింది. ఇలాంటి ఘటనలు తరుచూ చోటు చేసుకుంటూ ఉండటంతో హైదరాబాద్​ పోలీసులు ఇటీవల చిన్నారుల విషయంలో కారు ఓనర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డోర్​ లాక్​ చేసే ముందు లోపల ఎవరైనా ఉన్నారేమో చూడాలని, పార్క్​ చేసిన సమయంలో తప్పనిసరిగా లాక్​ చేయాలన్నారు.

    Latest articles

    BC Sankshema Sangham | బహుజన వీరుడు సర్దార్ పాపన్న గౌడ్

    అక్షరటుడే, ఇందూరు: BC Sankshema Sangham | సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sardar Sarvai Papanna Goud)...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేనా.. ప్రయత్నాలు ప్రారంభించిన ఎన్డీఏ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President | ఉపరాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అధికార ఎన్డీఏ కూటమి భావిస్తోంది. జగదీప్​...

    Raktha Veera Award | రేపు జాతీయ రక్త వీర అవార్డు అందుకోనున్న వెంకటరమణ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Raktha Veera Award | రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేసి సేవ చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు...

    Rahul Sipligunj | సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవ‌రంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Sipligunj | ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ అవార్డు అందుకున్న...

    More like this