అక్షరటుడే, వెబ్డెస్క్: Former YCP MP | వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ (YCP former MP nandighama suresh) కొన్నాళ్లుగా వివాదాలతోనే వార్తలలో నిలుస్తూ ఉండేవారు. ఆయన చాలా రోజుల పాటు జైల్లో ఉండి వచ్చినప్పటికీ తీరు ఏ మాత్రం మారలేదు. తాజాగా టీడీపీ కార్యకర్త రాజు అనే వ్యక్తిపై దాడి చేసి మరోసారి కేసుల్లో ఇరుక్కున్నారు. సురేష్ చేతిలో దెబ్బలు తిన్న రాజు ప్రస్తుతం మంగళగిరి ఆస్పత్రిలో (mangalagiri hospital) చికిత్స పొందుతున్నాడు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు (police) నందిగం సురేష్ ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది.. అరెస్టు చూపించి రిమాండ్ కు తరలిస్తారా.. స్టేషన్ బెయిల్ ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది. అయితే నందిగం సురేష్ స్వగ్రామం ఉద్దండరాయునిపాలెంలో శనివారం రాత్రి ఓ కారు అతివేగంగా వేగంగా దూసుకువచ్చింది.
Former YCP MP | తీరు మారలేదు..తీరు మారలేదు..
దీంతో ఇంత స్పీడ్ ఏంటని డ్రైవర్ ను రాజు (raju) మందలించాడు. విషయం తెలుసుకున్న సురేష్ అనుచరులు అక్కడికి చేరుకుని రాజుపై దాడి చేశారు. అనంతరం అతడిని సురేష్ ఇంటికి ఎత్తుకెళ్లారు. అక్కడ సురేష్ తో పాటు ఆయన అన్న ప్రభుదాసు, వారి బంధువులు సురేష్ పై తీవ్రంగా దాడి చేశారు. దాడిలో తీవ్ర గాయాలపాలైన రాజును అతని కుటుంబ సభ్యులు (family members) మంగళగిరి ఎయిమ్స్ లో చేర్పించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సురేష్ సోదరుడితో పాటు కేసులో ఉన్న వారి బంధువులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరికోసం పోలీసులు గాలిస్తున్నారు.
నందిగం సురేష్ రాజధాని వ్యవహారాల్లో జగన్ (YS jagan) కుట్రలు అమలు చేయడంలో మొదటి అడుగు వేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో చెరుకు తోటలకు నిప్పు పెట్టేవారు. ఈ వ్యవహారంలో ఆయనపై చాలా కేసులు నమోదయ్యాయి. కానీ ఆధారాల్లేకపోవడంతో బయటపడ్డారు. ఈ పనులు చేయడంతో జగన్ ఎంపీ టిక్కెట్ (MP ticket) ఇచ్చారు. ఎంపీ అయిన తర్వాత ఇసుక సహా ఇతర వ్యవహారాలతో పెద్ద ఎత్తున సంపాదించాడని అంటుంటారు. చివరికి యాత్ర సినిమాకు (yaatra movie) డబ్బులు బ్లాక్ మనీ అంతా సురేషే పెట్టారని చెబుతారు. అందుకే ఈ సినిమాలో ఆయన పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన పారిపోయారు. అయితే హైదరాబాద్ లో (hyderabad) పట్టుకుని తీసుకు వచ్చి జైలుకు పంపారు. ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చారు. అయినా తీరు మాత్రం మారడం లేదు కొందరు కామెంట్ చేస్తున్నారు.