అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | మండలంలోని చంద్రాయన్ పల్లి(Chandrayan Palli)లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయి. 44వ జాతీయ రహదారి పక్కనే విద్యుత్ తీగలు కిందికి వేళాడుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని గ్రామస్థులు వాపోతున్నారు. దీంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం వస్తున్నందున త్వరితగతిన నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
