Operation Sindoor
Operation Sindoor | ఆప‌రేష‌న్ సిందూర్‌పై అనుచిత వ్యాఖ్య‌లు.. అసోసియేట్ ప్రొఫెస‌ర్‌ అరెస్టు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Operation Sindoor | ఆప‌రేష‌న్ సిందూర్ గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఓ అసోసియేట్ ప్రొఫెస‌ర్‌ను భార‌త సైన్యం ఆదివారం అరెస్టు చేసింది. అశోక విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్‌ (associate professor), పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతిగా (head of the political science department) ప‌ని చేస్తున్న‌ అలీ ఖాన్ మహ్మదాబాద్‌ను ఆదివారం అరెస్టు చేసిన‌ట్లు భారత సైన్యం వెల్ల‌డించింది. ఆపరేషన్ సిందూర్ (operation sindoor) గురించి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు గాను ఈ మేర‌కు చ‌ర్యలు తీసుకున్న‌ట్లు తెలిసింది. మహ్మదాబాద్‌ను ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలోని (delhi) ఆయన నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం హర్యానాలోని సోనిపట్ జిల్లాలోని రాయ్ పోలీస్ స్టేషన్‌కు (sonipat district, ray police station) త‌ర‌లించి విచారిస్తున్నారు.

Operation Sindoor | మ‌త విశ్వాసాల‌ను రెచ్చ‌గొట్టార‌ని..

ఆప‌రేష‌న్ సిందూర్ (operation sindoor) గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ అలీఖాన్ సోష‌ల్‌మీడియాలో పోస్టు (ali khan social media post) పెట్టారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న వేర్పాటు వాదాన్ని ప్రోత్స‌హించేలా పోస్టులు పెట్టార‌ని హర్యానాలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) యూత్ ప్రధాన కార్యదర్శి యోగేష్ జతేరి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు ఆయ‌న‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు (police FIR registered) చేశారు. మత సామరస్యాన్ని ప్రోత్సహించడం, వేర్పాటువాదాన్ని లేదా సాయుధ తిరుగుబాటును ప్రేరేపించడం, మత విశ్వాసాలను అవమానించడం వంటి వాటితో సహా భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని అనేక నిబంధనలను చేర్చారు.