ePaper
More
    Homeఅంతర్జాతీయంPakistan PM | సిగ్గుమాలిన పాకిస్తాన్‌.. భార‌త్‌ను కాపీ కొడుతున్న దాయాది

    Pakistan PM | సిగ్గుమాలిన పాకిస్తాన్‌.. భార‌త్‌ను కాపీ కొడుతున్న దాయాది

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pakistan PM | భార‌త చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్తాన్ (pakistan) బుద్ధి ఇంకా మార‌లేదు. దాయాది దేశం భార‌త్‌ను కాపీ కొట్టేందుకు య‌త్నిస్తోంది. ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత పాకిస్తాన్ తీరును ఎండ‌గ‌ట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం (central governament) వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. సీమాంతర ఉగ్ర‌వాదాన్ని (terrorism) ఎగ‌దోస్తున్న పాకు కుటిల బుద్ధిని ప్ర‌పంచ దేశాలకు వివ‌రించేందుకు ప్ర‌తినిధి బృందాల‌ను పంపించ‌నుంది. ఇప్ప‌టికే అఖిల‌ప‌క్షాల‌కు చెందిన ఎంపీల‌తో ఏడు బృందాల‌ను నియ‌మించిన కేంద్రం వివిధ దేశాల‌కు పంపిస్తోంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.. ఈ విషయంలోనూ పాక్ భారత్‌కు పోటీ రావాలని చూస్తోంది. భారత ప్రతినిధుల బృందం.. పాకిస్తాన్ ఉగ్రవాదులకు (terrorists) సాయం చేయడంపై.. ఉగ్రవాదంపై భారత్ విధానాలను ప్రచారం చేయడానికి వెళుతుంటే.. పాక్ మాత్రం.. తాము శాంతికి పెద్ద పీట వేశామని చెప్ప‌కోవడానికి య‌త్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

    Pakistan PM | భుట్టోను పిలిచిన పాక్ ప్ర‌ధాని..

    పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (pakistan prime minister shehbaz sharif) ఈ విషయంపై మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో జర్దారీని (former foreign minister bilawal bhutto zardari) పిలిపించారు. పాకిస్తాన్ (pakistan) శాంతి కోసం పరితపిస్తోందంటూ ప్రపంచ దేశాలకు వివరించాలని బుట్టోకు చెప్పిన‌ట్లు తెలిసింది. ఈ విషయాన్ని బుట్టో సోషల్ మీడియాలో (social media) వెల్లడించారు. ‘ఈ రోజు ఉదయం ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (prime minister shehbaz sharif) నన్ను పిలిపించారు. పాక్ శాంతి కోసం పరితపిస్తున్న విధానాన్ని అంతర్జాతీయ వేదికలపై వివరించాలని చెప్పారు. ఆ బాధ్యతను తీసుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా దేశానికి సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాను’ అని అన్నారు.

    Pakistan PM | ప్ర‌తినిధి బృందాన్ని పంపేందుకు య‌త్నం..

    పాకిస్తాన్ మాజీ మంత్రి భుట్టో-జర్దారీ శనివారం రాత్రి సోషల్ మీడియా (social media) ద్వారా తన నియామకాన్ని ధ్రువీకరించారు, “ప్రధాని CMS షెహబాజ్ ఈరోజు ముందుగా నన్ను సంప్రదించారు, అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ శాంతి కోసం వాదనను ప్రదర్శించడానికి ఒక ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాలని ఆయన అభ్యర్థించారు. ఈ బాధ్యతను స్వీకరించడం మరియు ఈ సవాలుతో కూడిన సమయాల్లో పాకిస్తాన్‌కు సేవ చేయడానికి కట్టుబడి ఉండటం నాకు గౌరవంగా ఉంది” అని జియో న్యూస్ వెల్ల‌డించింది (geo news report).

    పాకిస్తాన్ ప్రధాన మంత్రి కార్యాలయం (prime minister office) నుంచి వచ్చిన ప్రకటన ప్రకారం.. ప్రతినిధి బృందం “భారతీయ ప్రచారాన్ని బహిర్గతం చేయడంష‌, ప్రాంతీయ శాంతి కోసం పాకిస్తాన్ ప్రయత్నాలను హైలైట్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు జియో న్యూస్ (geo news) తెలిపింది. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) (pakistan people party) చైర్మన్ భుట్టో-జర్దారీ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ సందర్భంగా, ప్రాంతీయ శాంతిపై ఇస్లామాబాద్ (islamabad) వైఖరిని ప్రదర్శించడానికి, “భారతీయ ప్రచారం”గా వర్ణించే దానిని ఎదుర్కోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    Latest articles

    Ration Rice | 32 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

    అక్షరటుడే, గాంధారి: Ration Rice | ఉచిత రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్సై...

    SI Sunil | సైబర్​ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, కోటగిరి: SI Sunil | ప్రజలు సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సునీల్ పేర్కొన్నారు....

    BRS | బీఆర్​ఎస్​కు మరో షాక్.. పార్టీని వీడనున్న 10 మంది మాజీ ఎమ్మెల్యేలు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRS | బీఆర్​ఎస్​ పార్టీకి మరో షాక్​ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పది మంది...

    Bheemgal | మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి

    అక్షరటుడే, భీమ్‌గల్‌: Bheemgal | మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఐకేపీ ఏపీఎం ప్రమీల సూచించారు. మంగళవారం మండలంలోని పిప్రి...

    More like this

    Ration Rice | 32 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

    అక్షరటుడే, గాంధారి: Ration Rice | ఉచిత రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్సై...

    SI Sunil | సైబర్​ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, కోటగిరి: SI Sunil | ప్రజలు సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సునీల్ పేర్కొన్నారు....

    BRS | బీఆర్​ఎస్​కు మరో షాక్.. పార్టీని వీడనున్న 10 మంది మాజీ ఎమ్మెల్యేలు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRS | బీఆర్​ఎస్​ పార్టీకి మరో షాక్​ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పది మంది...