అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vijayawada | ఈ రోజుల్లో ప్రేమ జంటలకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. చుట్టూ జనాలున్న విషయాన్ని కూడా మరిచిపోయి ఇష్టమొచ్చినట్టు పిచ్చి పనులు చేస్తున్నారు. తాజాగా బైక్ (bike) మీద ఓ ప్రేమజంట.. ‘మేఘాలలో తేలిపొన్నది..’ అనే పాటలో హీరోహీరోయిన్లు దూసుకుపోయినట్టుగా రయ్యిమంటూ వెళ్తున్నారు. అయితే రోజూ కొన్ని వేల ప్రేమ జంటలు తిరుగుతుంటాయి.. అయితే ఏంటీ అంటారా..? సాధారణంగా వెళ్తే.. అది వార్త ఎందుకవుతుంది. ప్రియుడు (boyfriend) బైక్ నడుపుతుంటే.. ప్రియురాలు (girlfriend) అసభ్యకరమైన యాంగిల్‌లో కూర్చొని వెళ్లింది. విజయవాడ (vijayawada) ఎన్‌హెచ్ 5 రామలింగేశ్వర నగర్ ఫ్లైఓవర్ (ramalingeshwara nagar flyover) వద్ద ఓ ప్రేమజంట బైక్‌పై వెళుతూ ఇలా ప్రవర్తించడంపై సభ్యసమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Vijayawada | ఇదేమి తీరంటూ మండిపడుతున్న నెటిజన్లు
వారి పక్కన ఎన్ని వెహికల్స్ వెళ్తున్నా కూడా వారు ఏ మాత్రం పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్టు బైక్‌పై రొమాన్స్ (romance) చేస్తూ అందరూ నోరెళ్లపెట్టేలా చేశారు. హద్దులు దాటిన ఈ ముద్దుల రొమాంటిక్ రైడ్ (romantic ride)పై ఆగ్రంహం వ్యక్తం చేస్తున్నారు. ఏకంతంగా స్వర్గంలో విహరిస్తున్నామనుకుందో ఏమో.. రద్దీ రోడ్డుపై(busy road) ఉన్నామన్న ధ్యాసే లేకుండా.. పక్కనుండి ఎన్ని వాహనాలు వెళ్తున్నా.. చుట్టూ ఉన్నవాళ్లు చూస్తారని కూడా ఆలోచించకుండా.. బైక్ మీదే రాసలీల మొదలుపెట్టేసారు. బైక్ నడుపుతున్న తన ప్రియుడి ముందు.. అంటే బైక్ పెట్రోల్ ట్యాంక్ (bike petrol tank) మీద.. బైకర్ రెండు చేతుల మధ్యలో కూర్చుని.. ప్రియుడు హెల్మెట్ పెట్టుకొని వామ్మో అనేలా చేశారు.
నడి రోడ్డుపైనే హద్దులు దాటి ముద్దులు కురిపిస్తుండడం చూసిన మిగతా వాహనదారులు.. హవ్వా అనుకుంటుంటే.. కార్లలో వెళ్లేవాళ్లు మాత్రం వెంటనే కెమెరాలు ఆన్ చేసి.. రోడ్డుపై రొమాన్స్‌ను రికార్డు చేశారు. వాటిని సోషల్ మీడియాలో(social media) పెట్టటంతో.. అవి కాస్త వైరల్‌గా మారాయి. అయితే.. సిగ్గు విడిచి రోడ్డుపై వాళ్లు చేస్తున్న ఈ రొమాన్స్(romance) వాళ్లకు బాగానే ఉండొచ్చు కానీ.. వాళ్ల వల్ల మిగతా వాహనదారులను మాత్రం జుగుప్స కలిగిస్తోంది. మిగతా వాహనాలకు ఇబ్బందికి గురవుతారన్న విషయాన్ని ఆ జంట పూర్తిగా మర్చిపోయారు. ప్రియురాలి ముద్దుల్లో మునిగిపోయి.. ఆ ప్రియుడు బైకును తీసుకెళ్లి ఎవరికో ఢీకొట్టటమో.. వాళ్లే ప్రమాదానికి గురవటమో జరిగే అవకాశం కూడా ఉందని అంటున్నారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్స్(netigens) విజ్ఞప్తి చేస్తున్నారు.