అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Old City | హైదరాబాద్ లోని hyderabad fire accident today పాతబస్తీ old city మీర్‌చౌక్ meer chowkలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. మీర్‌చౌక్‌లోని గుల్జార్ హౌస్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. భవనం మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు భారీగా వ్యాపించాయి. కృష్ణ పెరల్స్, మోదీ పెరల్స్ షాపుల్లో మంటలు అంటుకున్నాయి. దీంతో ఘటన స్థలంలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడగా స్థానికులు, పోలీసులు కలిసి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. 14 మంది మృతి చెందారు.
Old City | మృతుల వివరాలు..
అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. అభిషేక్ (30), ఆరూషి జైన్ (17), హర్షాలీ గుప్తా(7), శీతల్ జైన్ (37), రాజేందర్(67), ప్రియాన్షీ(6), ప్రథమ్(13), సుమిత్ర (65), మున్నీబాయ్(72), ఇరాజ్(2) చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది బెంగాల్‌కు చెందిన వారు ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లో బంధువుల ఇంటికి 4 కుటుంబాలు వచ్చాయి. వారిలో పలువురు చనిపోయినట్లు సమాచారం.
Old City | పరిహారం ప్రకటించిన ప్రధాని
మీర్చౌక్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ pm modi దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచి వేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం Compensation అందిస్తామని ఆయన ప్రకటించారు.
Old City | ఆరాతీసిన సీఎం రేవంత్
మీర్‌చౌక్ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి cm revanth reddy ఆరా తీశారు. ఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ponnam prabhakarను ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు.