More
    Homeఆంధ్రప్రదేశ్​ISRO PSLV-C61 Rocket | PSLV-C61 రాకెట్ ప్ర‌యోగం మూడో దశలో విఫ‌లం

    ISRO PSLV-C61 Rocket | PSLV-C61 రాకెట్ ప్ర‌యోగం మూడో దశలో విఫ‌లం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : ISRO PSLV-C61 Rocket | భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న కేంద్రానికి (ఇస్రో) ఆదివారం నిరాశ మిగిలింది. భూ ప‌రిశీల‌న కోసం ఆదివారం తెల్ల‌వారుజామున పంపిన PSLV-C61 రాకెట్ (PSLV-C61 rocket) ప్ర‌యోగం విజ‌య‌వంతం కాలేద‌ని ఇస్రో (ISRO) వెల్ల‌డించింది. మూడో ద‌శ‌లో సాంకేతిక లోపం త‌లెత్త‌డంతో మిష‌న్ పూర్తి కాలేద‌ని పేర్కొంది. భూమి పరిశీలన ఉపగ్రహం EOS-09 తో PSLV-C61 రాకెట్ ఆదివారం తెల్లవారుజామున శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం (space station) నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. అయితే, మూడో ద‌శ‌లో సాంకేతిక లోపం త‌లెత్త‌డంతో మిష‌న్ అసంపూర్ణంగా ముగిసింది. PSLV-C61 ప్రయోగంపై ఇస్రో చీఫ్ డాక్టర్ వి నారాయణన్ (ISRO chief Dr.V narayanan) మాట్లాడుతూ, “EOS-09 మిషన్ పూర్తి కాలేదు, మూడో ద‌శ‌లో అనుకున్న రీతిలో ఇంజిన్లు ప‌ని చేయ‌లేదు. ఇలా ఎందుకు జ‌రిగింద‌న్న దానిపై విశ్లేషించే ప‌ని ప్రారంభించాం. ప్ర‌స్తుతానికి ఈ మిష‌న్ పూర్తి కాలేద‌ని” ఆయ‌న చెప్పారు. అటు ఇస్రో కూడా X లో ఓ పోస్ట్ చేసింది. “ఈరోజు 101వ ప్రయోగాన్ని చేప‌ట్టాం. 2వ దశ వరకు PSLV-C61 పనితీరు సాధారణంగా ఉంది. 3వ దశలో పరిశీలన కారణంగా, మిషన్ పూర్తి కాలేదు” అని వెల్ల‌డించింది.

    ISRO PSLV-C61 Rocket | మెరుగైన సేవ‌ల కోసం..

    భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (indian space research organisation) ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ‌హ‌రికోట (srihari kota) నుంచి EOS-09 (భూమి పరిశీలన ఉపగ్రహం-09) ను SSPO కక్ష్యలోకి తీసుకువెళ్ళే PSLV-C61 ను ప్రయోగించింది. EOS-09 అనేది EOS-04 పునరావృత ఉపగ్రహం. రిమోట్ సెన్సింగ్ డాటా, యూజ‌ర్ క‌మ్యూనిటీ ఎంగేజ్‌డ్ ఆప‌రేష‌నల్ అప్లికేష‌న్ల‌లో ఫ్రిక్వెన్సీని మెరుగుప‌ర‌చాల‌నే ల‌క్ష్యంతో దీన్ని రూపొందించారు. నిమగ్నమైన వినియోగదారు సమాజానికి రిమోట్ సెన్సింగ్ డేటాను నిర్ధారించడం, పరిశీలన యొక్క ఫ్రీక్వెన్సీని మెరుగుపరచడం అనే లక్ష్యంతో రూపొందించబడింది. 22 గంటల కౌంట్‌డౌన్ ముగిసిన త‌ర్వాత ఆదివారం తెల్ల‌వారుజామున 5.59 గంట‌ల‌కు 44.5 మీటర్ల పొడవైన ‘PSLV-C61’ మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఉదయం 5.59 గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. కానీ, మూడో ద‌ద‌శ‌లో సాంకేతిక లోపం త‌లెత్తడంతో ప్ర‌యోగం విఫ‌ల‌మైంది.

    More like this

    Hyderabad Drug racket | హైదరాబాద్ నడిబొడ్డున డ్రగ్స్ కలకలం.. బడిలో తయారు చేస్తున్న ప్రిన్సిపల్​

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Drug racket | విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్​లో ఇటీవల వెలుగు చూస్తున్న డ్రగ్స్...

    Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kakatiya University : కాకతీయ యూనివర్సిటీ.. విద్యార్థుల ఘర్షణలకు అడ్డగా మారింది. తరచూ గొడవలు చెలరేగుతున్నాయి....

    Bihar election trains | తెలంగాణ మీదుగా బీహార్ ఎన్నికల రైళ్లు.. అవేమిటంటే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Bihar election trains | బీహార్​కు నూతన రైళ్లు, పొడిగింపుల పండుగ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో...