అక్షరటుడే, ఇందూరు: Nizamabad city | అధిక వడ్డీల పేరుతో అమాయక ప్రజలను వేధిస్తున్న కానిస్టేబుల్ కల్వారె గంగాధర్ పై రూరల్ ఠాణా(Rural police station) పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..
అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి వేధిస్తున్నారని నిజామాబాద్ నగరానికి (Nizamabad city) చెందిన తాండ్ర లక్ష్మణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ గంగాధర్పై Telagana State Prevention of Money Laundering Act కింద కేసు నమోదు చేశారు.
అలాగే నగరానికి చెందిన ఓ మహిళకు రూ.8 లక్షలు అధిక వడ్డీకి ఇచ్చి, బలవంతంగా ఆమె పేరుపై ఉన్న ఓపెన్ ప్లాట్(open plot)ను అతని పేరున సేల్ డీడీ చేయించుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రూరల్ ఠాణా పోలీసులు Telagana State prevention of Money Laundering Act లోని పలు సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు.