ePaper
More
    HomeజాతీయంGroom dies of heart attack | తాళి కట్టిన మూడు సెకన్లకే తెగిపోయిన మూడు...

    Groom dies of heart attack | తాళి కట్టిన మూడు సెకన్లకే తెగిపోయిన మూడు ముళ్ల బంధం.. గుండెపోటుతో పెళ్లికొడుకు మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Groom dies of heart attack : కొత్త జీవితం ప్రారంభించబోతున్నాం.. మా నవ జీవన వేడుకకు ఇంకా వారం రోజులే ఉంది.. వధూవరులు 7days to Go అని సామాజిక మాధ్యమాల్లో ఎంతో హ్యాపీగా పోస్టు పెట్టారు. ఆ సంతోష ఘడియ రానే వచ్చింది. ఎన్నో కొంగొత్త ఆశలతో తన బెటర్​ ఆఫ్​ మెడలో తాళి కట్టాడు. తనకు వరించబోతున్న జీవితాన్ని తలచుకుని ఆ పుత్తడి బొమ్మ తబ్బుబ్బి పోయింది. కానీ, ఆ ఆనందం క్షణాలు కూడా నిలవకుండా ఆవిరైపోయింది. పెళ్లి వేడుక(wedding ceremony) కాస్త విషాదాంతంగా మారింది.

    తాళి కట్టిన క్షణాల్లోనే పెళ్లి కొడుకు విగతజీవిగా మారి కుప్పకూలిపోయాడు. తాళిబొట్టుతో ఏర్పడ్డ వైవాహిక బంధం కళ్లు మూసి తెరిచేలోపలే ముగిసిపోయింది. కర్ణాటక(Karnataka)లోని జమఖండి గ్రామం(Jamkhandi village)లో గుండెను పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుకలో వధువు మెడలో తాళి కట్టిన మూడు సెకన్లకే పెళ్లి కొడుకు ప్రవీణ్​(26) గుండెపోటు(heart attack)తో మండపంలోనే కుప్పకూలిపోయాడు. కుటుంబీకులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

    సంబంధం కుదిరినప్పటి నుంచి వధూవరులు పెళ్లి వేడుక కోసం ఎంతో గొప్పగా ప్లాన్​ వేసుకున్నారు. ప్రతీ అకేషన్​ను గొప్పగా సెల్రబేట్​ చేసుకున్నారు. వారి ప్రీ వెడ్డింగ్​ షూట్(pre-wedding shoot)​ అయితే హైలెట్​. ఇప్పుడా వీడియో చూస్తూ పెళ్లి కూతురు, ఇరు కుటుంబాల వారు కన్నీటి పర్యంతమవుతున్నారు.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...