ePaper
More
    HomeజాతీయంOperation Sleeper Cells | హై అలర్ట్.. ఆపరేషన్​ స్లీపర్​ సెల్స్.. ఎన్​ఐఏ నిఘా!

    Operation Sleeper Cells | హై అలర్ట్.. ఆపరేషన్​ స్లీపర్​ సెల్స్.. ఎన్​ఐఏ నిఘా!

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Operation Sleeper Cells : జమ్మూకశ్మీర్‌(Jammu Kashmir)లోని పహల్​గామ్​​ ఉగ్రదాడి(Pahalgaon terror attack)కి ప్రతీకారంగా భారత్​ ఆపరేషన్​ సిందూర్​ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే మరోవైపు దేశంలో ఉంటూ పాక్​ కోసం స్లీపర్ సెల్స్‌గా పనిచేస్తున్న వారి వేట కొనసాగుతోంది. పహల్​గామ్​​ దాడిలో లష్కర్-ఎ-తోయిబాతో సంబంధం ఉన్న ఆరుగురు స్లీపర్ సెల్స్ సభ్యులు ఇన్వాల్వ్ కావడమే ఇందుకు కారణం. స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(State Investigation Agency) 20 ప్రదేశాలలో దాడులు చేసి, ఇప్పటికే 15 మంది అనుమానితులను అరెస్టు చేసింది.

    అటు పంజాబ్‌(Punjab)లోనూ ఇటీవల ప్రమాదకర ఆయుధాలు బయటపడ్డాయి. మే 6న హ్యాండ్ గ్రెనేడ్‌లు, రాకెట్ గ్రెనేడ్‌లు, ఒక నగరాన్ని నాశనం చేయగల సామగ్రి వెలుగుచూసింది. ఇది ISI పని అనేది భద్రతా బలగాల అనుమానం. ముంబయి విమానాశ్రయం(Mumbai airport)లో శనివారం ఇద్దరు ISIS ఉగ్రవాదులు అబ్దుల్లా ఫైయాజ్ షేక్, తల్హా ఖాన్ లను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(National Investigation Agency) అరెస్టు చేసింది. విచారణలో బాంబులతో నగరాన్ని నాశనం చేయాలని కుట్ర పన్నినట్లు తెలిసింది. ఇంకా ఎంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారన్నదానిపై దర్యాప్తు కొనసాగుతోంది.

    ముంబయిలో పట్టుబడ్డ నిందితులిద్దరూ పుణెలో ఇంప్రూవ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైసెస్ తయారీ కేసు(2023)లో మోస్ట్ వాంటెడ్‌ లిస్ట్‌లో ఉన్నారు. ఈ కేసు వల్ల ఇద్దరూ రెండేళ్లుగా పరారీలో ఉన్నారు. NIA నుంచి తప్పించుకోవడానికి అబ్దుల్లా ఫైయాజ్ షేక్, తల్హా ఖాన్ ఇండోనేషియాలోని జకార్తాకు పారిపోయారు. వారిపై ముంబయి NIA స్పెషల్ కోర్టు(Mumbai NIA Special Court) నాన్-బెయిలబుల్ వారెంట్‌లు ఇష్యూ చేసింది. ఒక్కొక్కరిపై రూ. 3 లక్షల రివార్డు సైతం ప్రకటించింది. ఇన్నాళ్లూ జకార్తాలో నక్కిన ఇద్దరు కూడా ముంబయిలో ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగించాలన్న పక్కా ప్లాన్‌తో ఇండియాకు తిరిగి వచ్చారు. కానీ, వీళ్లిద్దర్నీ ఎన్‌ఐఏ వలపన్ని పట్టుకుంది.

    హైదరాబాద్‌లోనూ స్లీపర్ సెల్స్ జాడలు లేకపోలేదు. స్థానిక స్లీపర్ సెల్స్ దాడులకు సిద్ధమవుతున్నారని మే 8న ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ ఏడాది జనవరిలో వరంగల్‌(Warangal)లో పాకిస్తానీ ఉగ్రవాది మహ్మద్ జక్రియా అనే స్లీపర్ సెల్ పట్టుబడ్డాడు.

    గుజరాత్‌లోనూ ప్రమాద హెచ్చరికలు ఇష్యూ అయ్యాయి. ఓడరేవులు, రైల్వే స్టేషన్‌లు, జనసమూహాలను లక్ష్యంగా స్లీపర్ సెల్స్ దాడి చేయొచ్చని ఇంటెలిజెన్స్ నివేదించింది. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు నిరంతరం నిఘా పెడుతున్నాయి.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...