అక్షరటుడే,ఇందూరు: Nizamabad City | నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లను రాత్రి వేళలో మూసివేసే సమయాన్ని 11 గంటల వరకు పెంచాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సీపీ సాయి చైతన్యతో (CP Sai Chaitanya)పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు (PCC Chief Mahesh Kumar Goud) శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దుకాణాలు త్వరగా మూసివేయడంతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అరగంట పెంచి తమకు ఆసరాగా నిలవాలని కోరారు. దీనిపై సీపీ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.
