More
    Homeఆంధ్రప్రదేశ్​Tailor shop | క‌స్ట‌మ‌ర్ల వ‌ద్ద‌కే టైల‌ర్ షాప్.. ఇదేదో బాగుంది క‌దా..!

    Tailor shop | క‌స్ట‌మ‌ర్ల వ‌ద్ద‌కే టైల‌ర్ షాప్.. ఇదేదో బాగుంది క‌దా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tailor shop | ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రు క్ష‌ణం తీరిక లేనంత బిజీ అయ్యారు. త‌మ త‌మ ప‌నుల‌తో బిజీ కావ‌డం వల‌న షాపింగ్ చేసే పరిస్థితి కూడా లేదు. టిఫిన్, క్యాఫ్‌, బాత్‌రూం ఇలా అన్నింటికి కూడా మొబైల్ షాప్స్ (mobile shops) వ‌చ్చేస్తున్నాయి. ఇంటి నుండి బ‌య‌ట‌కు రాలేని వారు మొబైల్ షాప్ ద్వారా తమ అవ‌స‌రాలు తీర్చుకుంటున్నారు. ఈ రోజుల్లో దుకాణానికి (Shop) వెళ్లి షాపింగ్‌ చేసే టైం లేదు, ఆన్‌లైన్లో ఆర్డర్‌ పెడితే అవి రావడానికి కొంత ఆలస్యం అయిన కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ స‌మ‌స్య‌కి చెక్‌పెట్ట‌డానికి ‘ట్రై అండ్‌ బై ఎట్‌ హోమ్‌’. అవునండీ.. బంగారం దగ్గర్నుంచీ బట్టల కొనుగోలు వరకూ మన ఇంటి దగ్గరికే వచ్చేస్తున్నాయి.

    Tailor shop | సూపర్ ఐడియా…

    ఇప్పుడంటే ఏమి కావాలన్నా, షాపింగ్‌ (shopping) చేయడానికి పెద్ద పెద్ద మాల్స్‌ (Malls) లాంటివి బోలెడు కనిపిస్తాయి. కానీ మ‌న‌ అమ్మమ్మల కాలంలో పరిస్థితి వేరు. బట్టలు అమ్మేవాళ్లే (clothes sellers) మూటలతో ఊరూరా తిరుగుతూ ఇళ్ల ముందుకు వచ్చి అమ్ముకునే వారు. కావాలంటే వాకిట్లోకి పిలిచి బేరసారాలు చేసి నచ్చితే కొనేవాళ్లు, లేదంటే లేదు. ఇదిగో ఇప్పుడా పాత పద్ధతిలోని సౌకర్యాన్ని నవ తరానికి (new generation) పరిచయం చేస్తూ నయా ట్రెండ్‌ను తీసుకొచ్చాయి కొన్ని దుకాణాలు. ఇల్లూ, ఆఫీసూ పనులతో గంటలతరబడి బయటకెళ్లి షాపింగ్‌ (shoping) చేయలేక, ఆన్‌లైన్లో (online) అందుబాటులో ఉన్నవాటినే సెలక్ట్​ చేసుకొని ఆర్డర్‌ పెట్టుకుంటున్నారు.

    ఆన్‌లైన్ వాటితో కొంత స‌మ‌యం ప‌డుతుంది. అప్ప‌టికి ఆగ‌లేని వారి కోసం మొబైల్ షాప్స్ (mobile shops) వ‌చ్చేస్తున్నాయి. ఇంటికే వెళ్లి వారి అవ‌స‌రాలు తీరుస్తున్నారు కొన్ని మొబైల్ టైల‌ర్ షాప్స్ (tailor shops). తాజాగా టైల‌ర్ ఏమ‌నుకున్నాడో ఏమో కాని ఇంటింటికి వెళ్లి మ‌రీ బ‌ట్ట‌లు కుడుతున్నాడు. ఈ రోజుల్లో మొబైల్ ట్రెండ్ (mobile trend) బాగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో మొబైల్ టైల‌ర్ షాప్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన నెటిజ‌న్స్ పరిస్థితిని బ‌ట్టి భ‌లే ఆలోచ‌న‌లు చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

    More like this

    Hyderabad Drug racket | హైదరాబాద్ నడిబొడ్డున డ్రగ్స్ కలకలం.. బడిలో తయారు చేస్తున్న ప్రిన్సిపల్​

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Drug racket | విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్​లో ఇటీవల వెలుగు చూస్తున్న డ్రగ్స్...

    Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kakatiya University : కాకతీయ యూనివర్సిటీ.. విద్యార్థుల ఘర్షణలకు అడ్డగా మారింది. తరచూ గొడవలు చెలరేగుతున్నాయి....

    Bihar election trains | తెలంగాణ మీదుగా బీహార్ ఎన్నికల రైళ్లు.. అవేమిటంటే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Bihar election trains | బీహార్​కు నూతన రైళ్లు, పొడిగింపుల పండుగ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో...