ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Hall Tickets | ఇంటర్​ ‘సప్లిమెంటరీ’ హాల్​ టికెట్ల విడుదల

    Hall Tickets | ఇంటర్​ ‘సప్లిమెంటరీ’ హాల్​ టికెట్ల విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hall Tickets | ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల (supplimentary exams) హాల్‌ టికెట్స్‌ (hall tickets) విడుదల అయ్యాయి. ఈ నెల 22 నుంచి 29 వరకు సప్లిమెంటరీ పరీక్షలు (inter supply exams) జరగనున్నాయి. ఇంటర్​ బోర్డు (inter board) హాల్​టికెట్లను శనివారం సాయంత్రం ఆన్​లైన్​లో విడుదల చేసింది. జూన్‌ 3 నుంచి జూన్‌ 6 వరకు ప్రాక్టికల్​ పరీక్షలు practical exams, జూన్‌ 9, 10 తేదీల్లో ఇంగ్లిష్​ ప్రాక్టికల్​ పరీక్షలు జరగనున్నాయి. https://tgbie.cgg.gov.in/ వెబ్​సైట్​ నుంచి హాల్​టికెట్లు డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

    కాగా.. ఇంటర్​ ఫస్టియర్​లో fist year 65.96 శాతం, సెకండియర్​ second yearలో 65.65 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. దీంతో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 4,12,724 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఫస్టియర్‌ జనరల్‌ విద్యార్థులు 2,49,032 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 16,994 మంది ఉన్నారు. ఫస్టియర్​ విద్యార్థుల్లో ఫెయిల్​ అయిన వారితో పాటు మార్కులు పెంచుకోవడానికి ఇంప్రూవ్​మెంట్(Improvement)​ రాసే వారు కూడా ఉంటారు. సెకండియర్​ సప్లిమెంటరీ పరీక్షలకు జనరల్‌ విద్యార్థులు 1,34,341 మంది, ఒకేషనల్‌ పరీక్షలకు 12,357 మంది హాజరుకానున్నారు. ఉదయం ఫస్టియర్​ విద్యార్థులకు, మధ్యాహ్నం సెకండియర్​ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...