Rohit sharma
Rohit sharma | కార్‌కు సొట్ట.. తమ్ముడిపై రోహిత్ సీరియస్! (వీడియో)

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Rohit sharma | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (team india captain rohit sharma) తన తమ్ముడు విశాల్ శర్మపై (vishal sharma) ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు ఇష్టమైన కార్‌కు సొట్ట పడటంతో రోహిత్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ ఘటన వాంఖడే స్టేడియంలో శుక్రవారం చోటు చేసుకుంది. ముంబై క్రికెట్ అసోసియేషన్(MCA) వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరిట ఓ కొత్త స్టాండ్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ స్టాండ్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో (chief minister devendra fadnavis) కలిసి రోహిత్ శర్మ తల్లిదండ్రులు పూర్ణిమా-గురునాథ్ శర్మ‌లు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రోహిత్ శర్మ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.

ఈ కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత ఇంటికి వెళ్తున్న స‌మ‌యంలో కారు (car) వెనుక భాగంలో డెంట్ పడటం చూసిన రోహిత్ శర్మ సహనం కోల్పోయాడు. తమ్ముడు విశాల్‌‌కు కార్ వెనుక భాగంలోని సొట్టను చూపిస్తూ.. ‘యే క్యా హై’ అంటూ మందలించాడు. రివ‌ర్స్ తీసుకునే స‌మ‌యంలో డెంట్ పడిన‌ట్లుందని విశాల్ చెప్పే ప్రయత్నం చేయగా.. రోహిత్ (rohit sharma) మరింత ఆగ్రహానికి గురయ్యాడు. ‘ఎవరి వల్లా ఈ డెంట్.. నీ వల్లే ఇదంతా’అంటూ అసహనం వ్యక్తం చేశాడు. కుటుంబ సభ్యుల (family members) సమక్షంలోనే విశాల్‌ను రోహిత్ మందలించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా (video viral) మారింది. కార్ లవర్స్ (car lovers) ఎవరూ డెంట్స్‌ను సహించరని, రోహిత్ శర్మ కూడా అదే చేశాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

రోహిత్ శర్మకు కార్లు అంటే పిచ్చి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని దగ్గర లంబోర్ఘిని ఉరుస్, బీఎమ్‌డబ్ల్యూ ఎమ్5, మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్, మెర్సిడెస్-బెంజ్ GLS, రేంజ్ రోవర్ HSE LWB, BMW X3, మెర్సిడెస్ GLS 400d, టయోటా ఫార్చ్యూనర్, స్కోడా లారా వంటి లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా రోహిత్.. కార్ డ్రైవింగ్‌ను (car driving) ఆస్వాదిస్తాడు. గతంలో అతివేగంగా కారు నడిపి పోలీసుల జరిమానాకు కూడా రోహిత్ గురయ్యాడు.