ePaper
More
    HomeజాతీయంSpying | ఇంటి దొంగల పని పడుతున్న కేంద్రం.. అస్సాంలో ఏడుగురి అరెస్ట్​

    Spying | ఇంటి దొంగల పని పడుతున్న కేంద్రం.. అస్సాంలో ఏడుగురి అరెస్ట్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Spying | ఆపరేషన్​ సిందూర్ (operation sindoor)​తో ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్​ pakistan ఆట కట్టించిన భారత్​.. ఇప్పుడు ఇంటి దొంగల పని పడుతోంది. భారత్​లో ఉంటూ పాక్​కు సాయం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తోంది. పహల్​గామ్​ ఉగ్రదాడి pahalgam terror attack తర్వాత భారత్​, పాకిస్తాన్​ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్​ ఆపరేషన్​ సిందూర్​ చేపట్టి టెర్రరిస్టుల క్యాంపులను ధ్వంసం చేసింది. అనంతరం పాకిస్తాన్​ భారత్​పై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయగా మన రక్షణ వ్యవస్థ indian defence system తిప్పికొట్టింది. అంతేగాకుండా పాక్​లోని పలు ఎయిర్​బేస్​ pak airbase లపై భారత్​ వైమానిక దళం indian air force దాడులు చేసింది. అనంతరం ఇరుదేశాలు కాల్పుల విరమరణ ceasefireకు అంగీకరించాయి.

    Spying | గూఢచారులపై నిఘా

    పాకిస్తాన్​ ఉద్రిక్తతల వేళ భారత నిఘా వర్గాలు Intelligence agencies దాయాది దేశం గూఢచారులపై నిఘా పెట్టాయి. భారత్​లో ఉంటూ పాకిస్తాన్​కు​ రహస్య సమాచారం అందిస్తున్న వారి వివరాలు ఆయా రాష్ట్ర పోలీసులకు అందిస్తున్నాయి. దీంతో పోలీసులు పాక్​కు సమాచారం చేరవేస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా అస్సాం పోలీసులు పాకిస్తాన్​కు సాయం చేస్తున్న ఏడుగురిని అరెస్ట్​ చేశారు.

    Spying | వాట్సాప్​ ఓటీపీలు చెప్పి..

    భారతీయ ఫోన్ నంబర్లతో వాట్సాప్​ ఇన్​స్టాల్​ చేసుకోవడానికి ఓటీపీలు చెబుతున్న ఏడుగురిని అస్సాంలో అరెస్ట్​ చేశారు. అస్సాం DGP హర్మీత్ సింగ్ harmot singh మాట్లాడుతూ.. పాకిస్తాన్‌లోని వ్యక్తులకు ఓటీపీ OTPలు పంపుతున్నట్లు తమకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందిందన్నారు. దీంతో సాంకేతిక ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశామన్నారు.

    Spying | ఆపరేషన్​ గోస్ట్​ సిమ్​

    అస్సాం పోలీసులు నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఆపరేషన్​ గోస్ట్​ సిమ్​ Operation Ghost SIM ప్రారంభించారు. ఇందులో భాగంగా రాజస్థాన్‌, హైదరాబాద్‌కు బృందాలను పంపారు. మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్​ చేశారు. భరత్‌పూర్, అల్వార్‌లో, గౌహతి విమానాశ్రయంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సిమ్​ కార్డులతో సైబర్ నేరాలు చేయడంతో పాటు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కూడా ఉపయోగించినట్లు డీజీపీ తెలిపారు. ఈ నంబర్‌లలో కొన్నింటిని దేశ వ్యతిరేక శక్తులు విస్తృతంగా ఉపయోగించినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. వారిని విచారించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన వివరించారు.

    Spying | పాక్​కు వెళ్లి వచ్చి..

    గూఢచర్యం ఆరోపణలపై హర్యానా యూట్యూబర్​ జ్యోతి మల్హోత్రాను (youtuber jyoti malhotra) హిసార్ పోలీసులు (hiser police) అరెస్ట్​ చేశారు. పాక్​లో ఐఎస్​ఐ అధికారులతో సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు గుర్తించారు. ఆమె గతంలో ట్రావెల్​ వీసాపై పాకిస్తాన్​లో​ పర్యటించింది. గూఢచర్యం ఆరోపణలపై ఆమెతో సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్​ చేసినట్లు సమాచారం. మరోవైపు హర్యానాకు చెందిన దేవేంద్ర సింగ్​ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవేంద్ర సింగ్​ 2024లో కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్​ వెళ్లాడు.

    అక్కడ పాకిస్తానీ నిఘా అధికారిని ఆయన కలిశాడు. హనీట్రాప్ ద్వారా దేవేంద్ర సింగ్‌ devendra singh ను పాకిస్తాన్​ నిఘా సంస్థ ఐఎస్​ఐ(Pakistan intelligence agency ISI) తమ గుప్పిట్లో పెట్టుకుంది. దేవేంద్రసింగ్​ భారత సైనిక స్థావరాల వివరాలను పాక్‌కు అందించినట్లు గుర్తించారు. ఇతర ప్రాంతాల్లో కూడా పాక్​కు సమాచారం చేరవేస్తున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...