అక్షరటుడే, బిచ్కుంద: Indiramma Housing Scheme | అర్హులైన ప్రతి కుటుంబానికి మండలకేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల (indiramm Illu) నిర్మాణ పనులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు (MLA Thota Lakshmi Kantharao) శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఇళ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలనే సంకల్పంతో పని చేస్తుందని, అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమం లో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
