అక్షరటుడే, ఇందూరు: Lions Club of Indur | లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ బీవోడీ సమావేశాన్ని నగరంలోని సందీప్ గార్డెన్స్‌లో(Sandeep Garderns) శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి తీర్మానం చేశారు. అనంతరం ఉత్తమ వైద్య సేవలకు గాను విస్సా హెల్త్ ఎక్స్ పురస్కారం (VISA Health X Award) అందుకున్న లయన్స్ క్లబ్ డైరెక్టర్(Lions Club Director) ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ బొద్దుల రాజేంద్రప్రసాద్‌ను (Pulmonologist Dr. Boddula Rajendra Prasad) సన్మానించారు. ఆయనకు రాష్ట్రస్థాయి పురస్కారం రావడం అభినందనీయమని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అబ్బాయి లింబాద్రి అన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు వీరేశం, లక్ష్మీనారాయణ, రవీందర్, రాజేందర్, రాఘవేందర్, శివలింగం, చింతల గంగాదాస్, బి గురుప్రసాద్, రామకృష్ణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.