ePaper
More
    HomeతెలంగాణMLA Maheshwar Reddy | బీఆర్ఎస్ చీల‌డం ప‌క్కా.. బీజేపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

    MLA Maheshwar Reddy | బీఆర్ఎస్ చీల‌డం ప‌క్కా.. బీజేపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: MLA Maheshwar Reddy | బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్‌రెడ్డి (BJP legislative party leader maheshwar reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ చీలిపోవ‌డం ప‌క్కా అని, అది నాలుగు ముక్క‌లవుతుంద‌ని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌లో (BRS) నాలుగు స్తంభాలాట నడుస్తోందన్నారు. శనివారం ఆయ‌న మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు(former minister harish rao) నేతృత్వంలో బీఆర్‌ఎస్ చీలిక దిశగా అడుగులు వేస్తోందన్నారు. పదిమంది ఎమ్మెల్యేలు వెళ్లిపోతే బీఆర్‌ఎస్ఎల్పీ చీలిపోతుందన్నారు. తండ్రీ, కొడుకు, కూతురు, అల్లుడు మధ్య విబేధాలు ఉన్నాయని తెలిపారు. రజతోత్సవ సభలో(silver jubilee meeting) కేటీఆర్‌దే పెత్తనమని.. కవిత, హరీశ్‌రావులకు (kavitha and harish rao) ఎలాంటి అవకాశం ఇవ్వలేదన్నారు. హరీశ్‌, కవితలు డమ్మీగా మిగిలారన్నారు. వివిధ కారణాలతో కేసీఆర్ (KCR) క్రియాశీలకంగా ఉండడం లేదని.. సభలో కూడా అంత యాక్టీవ్‌గా లేరన్నారు. తన తరువాతి బీఆర్ఎస్ చీఫ్ కేటీఆర్ (BRS chief KTR) అని పరోక్షంగా ఇండికేషన్ ఇచ్చారని గుర్తు చేశారు.

    MLA Maheshwar Reddy | అసంతృప్తిలో క‌విత‌, హ‌రీశ్‌..

    బీఆర్ఎస్ డీఫాక్టో ప్రెసిడెంట్‌గా కేటీఆర్ (KTR) కొనసాగుతున్నారని.. కేసీఆర్ (KCR) ఆయ‌న‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని మ‌హేశ్వ‌ర్‌రెడ్డి (maheshwar reddy) తెలిపారు. ర‌జ‌తోత్స‌వ సభలో తండ్రీకొడుకులు కీలకంగా వ్యవహరించారన్నారు. దీనిపై కవిత, హరీశ్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. కవిత ఒంటరి అయ్యిందని, ఆధిపత్య‌ పోరు తారా స్థాయికి చేరిందని పేర్కొన్నారు. కవిత తీసుకున్న తెలంగాణ తల్లి మార్పు, పూలే విగ్రహం ఏర్పాటుకు పార్టీ నుంచి మద్దతు రాలేదన్నారు.

    MLA Maheshwar Reddy | క‌విత తిరుగుబాటు..

    సొంత పార్టీపై క‌విత (kavitha) తిరుగుబాటు లేవ‌దీశార‌ని మ‌హేశ్వ‌ర్‌రెడ్డి (maheshwar reddy) వ్యాఖ్యానించారు. ఈ మ‌ధ్య కాలంలో ఆమె చేస్తున్న వ్యాఖ్య‌లు అందుక్కార‌ణ‌మ‌ని గుర్తు చేశారు. మహిళా సమానత్వం, సామాజిక తెలంగాణ సాధన అంశంలో బీఆర్ఎస్ (BRS) విఫలమైందన్న వ్యాఖ్యలు వ్యూహాత్మకమే అని వెల్లడించారు. పదవులు, ఆస్తులు అన్నీ కేటీఆర్​కేనా అంటూ లేఖాస్త్రం సంధించ‌డం ద్వారా కవిత తిరుగుబాటు చేశారన్నారు. కేసీఆర్ (KCR) పదేళ్ల పాలనపై కవిత విమర్శలు చేస్తున్నారని.. కేసీఆర్‌కు రాసిన లేఖ త్వరలోనే బయటపెట్టే అవకాశం ఉందని చెప్పారు. ఉద్యమంలో జాగృతి కృషి ఉందని, వాస్తవాలు బయటపెట్టాలని కవిత అనుకుంటున్నట్లు తెలిపారు. కేటీఆర్‌కే అన్నీ ఇస్తుండడంతో కవిత తిరుగుబాటు జెండా ఎగురవేశారని వ్యాఖ్యానించారు.

    తనను రాజకీయంగా (politics) అణిచి వేసేందుకు కేటీఆర్ కుట్ర చేస్తున్నారని ఆవేదనతో క‌విత ర‌గిలిపోతున్నార‌ని చెప్పారు. అందుకే మేడే రోజు తండ్రి పాలనా వైఫల్యాలు ఎండగట్టినట్లు చెప్పారు. తనను రెచ్చగొడితే మరింత రెచ్చిపోతానని చెప్పడం ద్వారా ఆమెలోని ఆవేదన బయటపడిందన్నారు. బీఆర్ఎస్‌లో (BRS) ఒకే పవర్ సెంటర్ ఉండాలని కేటీఆర్ అభిమతమని తెలిపారు. జగన్, షర్మిల (jagan sharmila) తరహాలోనే కేటీఆర్‌కు కవిత తయారైనట్లు తెలిపారు. సొంత ఎజెండా పెట్టుకుని పని చేయకూడదని కేటీఆర్ చెప్పడం ఇందుకు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్‌పై విమర్శలు చేసిన వెంటనే హరీశ్​రావు మీడియా సమావేశం వెనక కేసీఆర్ హస్తం ఉందన్నారు.

    MLA Maheshwar Reddy | హ‌రీశ్ చీల్చ‌డం ఖాయం..

    హ‌రీశ్‌రావు (harish rao) బీఆర్ఎస్‌ను చీల్చ‌డం ఖాయ‌మ‌ని మ‌హేశ్వ‌ర్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్‌ను చీల్చడం రేవంత్‌రెడ్డితో కాలేదని.. అందుకే హరీశ్‌ను అడ్డం పెట్టుకొని తన పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఫారిన్ టూర్‌కి వెళ్లగానే బీఆర్ఎస్‌లో చీలిక రాబోతోందంటూ సంచలన కామెంట్స్ (sensational comments) చేశారు. ఈ నెలాఖరులోగా లేదా మొదటి వారంలో చీలిక వస్తుందన్నారు. చీలిక కోసం తెర వెనుక జరగాల్సిన తంతు రేవంత్ రెడ్డి (revanth reddy) సహకారంతో హరీశ్‌రావు, కవిత చేస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్‌లో ఉంటే తమకు ఎదిగే అవకాశం ఉండదని హరీశ్​, కవితలు ఈ వ్యూహానికి తెర తీశారని వ్యాఖ్యానించారు.

    More like this

    Local Body Elections | స్థానిక ఎన్నికలపై కీలక అప్​డేట్​.. రిజర్వేషన్ల పెంపునకు గవర్నర్​ ఆమోదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్​డేట్​ వచ్చింది. బీసీ...

    Sriram Sagar | శ్రీరాంసాగర్ వరద గేట్ల మూసివేత

    అక్షరటుడే, బాల్కొండ: Sriram Sagar | తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి (Sriram Sagar Project) వరద తగ్గుముఖం...

    Yellareddy | చెరువు బాగు కోసం రైతులంతా ఏకమయ్యారు..

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా గ్రామస్థులు తమ చెరువును...