Mumbai-Stadium
Mumbai Stadium | 5 సంవ‌త్స‌రాల‌లో ల‌క్ష కెపాసిటీతో కొత్త స్టేడియం.. సీఎం దేవంద్ర ఫ‌డ్న‌వీస్ వ్యాఖ్య‌లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Mumbai Stadium | మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) మహారాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. సామాన్యుల‌కే కాక క్రీడాకారుల‌తో ప‌టు ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌కి ఆయ‌న అండ‌గా నిలుస్తున్నారు. ప్రధాని మోదీ (Prime Minister Modi) మార్గదర్శకత్వంలో ఆయన విజన్ స్ఫూర్తి తో ఫడ్నవీస్‌ డైనమిక్ నాయకత్వం మహారాష్ట్ర పురోగతిని కొత్త శిఖరాలవైపు నడిపిస్తుంది. తాజాగా ఫ‌డ్న‌వీస్ ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొని ముంబైలో ల‌క్ష మంది కెపాసిటీతో ఒక స్టేడియం నిర్మిస్తాన‌ని చెప్పారు. 5 ఏళ్ల‌లోపు దీనిని పూర్తి చేస్తాన‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. ఇప్ప‌టికే ముంబైలో వాంఖ‌డే స్టేడియం(Wankhede Stadium) ఉండ‌గా, ఇప్పుడు కొత్త స్టేడియం నిర్మిస్తాన‌ని ఫ‌డ్న‌వీస్ చెప్ప‌డం ఆస‌క్తి రేకెత్తిస్తుంది.

Mumbai Stadium | కొత్త స్టేడియం..

ఇక ఇదిలా ఉంటే భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కు తాజాగా అరుదైన ఘనత దక్కింది. తన సొంత గ్రౌండ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండుకు త‌న పేరు పెట్టారు. త‌న కుటుంబ స‌భ్యులు స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ వేడుక‌కు అభిమానులు కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా నిర్వ‌హించిన స‌మావేశంలో రోహిత్ ఎమోష‌న‌ల్ గా మాట్లాడాడు. త‌న జీవితంలో ఇలాంటి రోజు వ‌స్తుంద‌ని అనుకోలేద‌ని పేర్కొన్నాడు. చిన్న‌ప్ప‌టి నుంచి ముంబై(Mumbai) త‌ర‌పున‌, ఇండియా త‌ర‌పున ఆడాల‌ని ఎన్నో క‌ల‌లు క‌న్నాన‌ని, వాంఖెడే స్టేడియంలో త‌న పేరిట స్టాండ్ ఉండ‌టం మ‌రిచిపోలేని అనుభూతి అని పేర్కొన్నాడు.

ముంబై స్టేడియంలో గ‌తంలో స‌చిన్ టెండూల్క‌ర్, వినూ మ‌న్క‌డ్, సునీల్ గావ‌స్క‌ర్‌ (Sunil Gavaskar), దిలీప్ వెంగ‌సర్క‌ర్ పేర్ల‌తో స్టాండును నిర్మించారు. ఇప్పుడు ఈ జాబితాలో రోహిత్(Rohit) కూడా చేరాడు. ఈ స్టేడియంలో స్టాండును త‌న పేరిట నెల‌కొల్ప‌డంతో ఎప్పుడెప్పుడు మ్యాచ్ ఆడుదామా అని ఎదురు చూస్తున్న‌ట్లు రోహిత్ పేర్కొన్నాడు. ఐపీఎల్లో భాగంగా ఈనెల 21న ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తో మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న‌ట్లు పేర్కొన్నాడు. ఇక త‌న త‌ల్లిదండ్రులు, భార్య‌, పిల్ల‌లు, సోద‌రుడి కుటుంబం ముంద‌ర ఈ గౌర‌వాన్ని అందుకోవ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని పేర్కొన్నాడు. . ఈ కార్యక్రమంలో రోహిత్ కుంటుంబ సభ్యులతోపాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాజకీయ నాయకులు, క్రికెటర్లు పాల్గొన్నారు.