ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar project | కళ తప్పిన నిజాంసాగర్​.. తగ్గిపోతున్న పర్యాటకుల సంఖ్య

    Nizamsagar project | కళ తప్పిన నిజాంసాగర్​.. తగ్గిపోతున్న పర్యాటకుల సంఖ్య

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar project | వందేళ్ల చరిత్ర గల నిజాంసాగర్​ ప్రాజెక్ట్​పై (nizamsagar project) పట్టింపు కరువైంది. ఒకప్పుడు పర్యాటకులకు (tourists)ఆహ్లాదాన్ని పంచిన ప్రాజెక్ట్​ అందాలు.. ఇప్పుడు కనమరుగవుతున్నాయి. వేసవి వచ్చిందంటే పర్యాటకుల రద్దీగా ఉండే జలాశయం పరిసరాలు ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తున్నాయి.

    నిజాం హయాంలో మంజీర నదిపై (majeera river) నిజాంసాగర్ మండలం అచ్చంపేట– బంజేపల్లి గ్రామాల (achampet-bajempally villages) పరిధిలో 1923-31 మధ్యకాలంలో నిర్మించారు. ప్రధాన ఇంజినీర్​ నవాబ్ ఆలీ​ జంగ్​ బహదూర్​ పర్యవేక్షణలో ప్రాజెక్ట్​ నిర్మాణం పూర్తి చేశారు. 1405 అడుగుల ఎత్తు, 30 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించారు. ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో (joint nizamabad district) 2.70 లక్షల ఎకరాలకు ఈ జలాశయం ద్వారా సాగునీరు అందుతోంది. అయితే ప్రాజెక్ట్​ నిర్మాణ (project construction) సమయంలోనే ప్రజల ఆహ్లాదం కోసం పలు నిర్మాణాలు చేపట్టారు. వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుతున్నాయి.

    Nizamsagar project | నిర్వహణ లేకపోవడంతో..

    ప్రాజెక్ట్ వద్ద సమ్మర్​ బాగ్​, స్మిమ్మింగ్​పూల్​, గోల్​ బంగ్లా నిర్మించారు. నిజాం హయాంలో కట్టిన ఈ నిర్మాణాలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. అయితే నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే ప్రాజెక్ట్​ సందర్శనకు నిత్యం పర్యాటకులు తరలి వచ్చేవారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర (maharastra), కర్నాటక (karnataka) నుంచి కూడా ప్రాజెక్ట్​ అందాలు చూసేందుకు వచ్చేవారు. ప్రాజెక్ట్​ దిగువన ఉన్న సమ్మర్​ బాగ్​లో దొరికే పండ్లను తినేవారు. స్విమ్మింగ్​పూల్​ ఆహ్లాదంగా గడపడంతో పాటు, గోల్​బంగ్లా తదితర ప్రాంతాల్లో సేద తీరేవారు. పట్టించుకునే వారు లేకపోవడంతో సమ్మర్​బాగ్​లో చెట్లన్నీ ఎండిపోయాయి. స్విమ్మింగ్​పూల్​లో నీరు (swimming pool water) నింపడం లేదు. ఫౌంటేన్​ కూడా నిరుపయోగంగా మారింది.

    Nizamsagar project | పత్తాలేని బోటు షికారు

    నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ (nizamsagar project) చూడడానికి వచ్చే పర్యాటకులు గతంలో బోటులో షికారు చేసేవారు. గతంలో బోటు అందుబాటులో ఉండేది. దీంతో పర్యాటకులు (tourists) అందులో షికారు చేసి జలాశయం అందాలను తిలకించేవారు. కానీ కొన్నేళ్లుగా ఇక్కడ బోటు షికారు లేకుండా పోయింది. దీంతో పర్యాటకుల తాకిడి క్రమంగా తగ్గిపోతోంది. అధికారులు స్పందించి ప్రాజెక్ట్​ను పర్యాటక కేంద్రంగా (tourist center) మార్చి, వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

    Latest articles

    Minister Ponguleti | రెవెన్యూ మంత్రి పొంగులేటిని కలిసిన వీఆర్ఏలు

    అక్షరటుడే, భీమ్​గల్ : Minister Ponguleti | గ్రామ పరిపాలన అధికారులుగా (జీపీఓ)లుగా వీఆర్ఏలను నియమించే ప్రక్రియను ప్రారంభించిన...

    India – Russia | “ఈ రోజు.. ఆనాడు”.. ట్రంప్‌కు గ‌ట్టి జ‌వాబిచ్చిన ఆర్మీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India - Russia | భార‌త్‌, ర‌ష్యా మ‌ధ్య ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల కొనుగోళ్లు, వాణిజ్య...

    Collector Nizamabad | కుర్నాపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

    అక్షరటుడే, బోధన్: Collector Nizamabad | ఎడపల్లి మండలం కుర్నాపల్లి (Kurnapalli Village) కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector...

    Kubreshwar Dham Stampede | కుబ్రేశ్వర్ ధామ్‌లో తొక్కిసలాట.. ఇద్దరు భక్తుల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kubreshwar Dham Stampede | మధ్యప్రదేశ్(Madhya Pradesh)​లో విషాదం చోటు చేసుకుంది. సెహోర్‌లోని కుబ్రేశ్వర్...

    More like this

    Minister Ponguleti | రెవెన్యూ మంత్రి పొంగులేటిని కలిసిన వీఆర్ఏలు

    అక్షరటుడే, భీమ్​గల్ : Minister Ponguleti | గ్రామ పరిపాలన అధికారులుగా (జీపీఓ)లుగా వీఆర్ఏలను నియమించే ప్రక్రియను ప్రారంభించిన...

    India – Russia | “ఈ రోజు.. ఆనాడు”.. ట్రంప్‌కు గ‌ట్టి జ‌వాబిచ్చిన ఆర్మీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India - Russia | భార‌త్‌, ర‌ష్యా మ‌ధ్య ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల కొనుగోళ్లు, వాణిజ్య...

    Collector Nizamabad | కుర్నాపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

    అక్షరటుడే, బోధన్: Collector Nizamabad | ఎడపల్లి మండలం కుర్నాపల్లి (Kurnapalli Village) కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector...