అక్షరటుడే, వెబ్‌డెస్క్: YouTuber Arrest | గూఢచర్యం ఆరోపణలపై హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను (youtuber jyoti malhotra) హిసార్ పోలీసులు (hiser police) అరెస్ట్ చేశారు. పాక్లో ఐఎస్ఐ అధికారులతో (pakistan ISI officials) సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు గుర్తించారు. ఆమె గతంలో ట్రావెల్ వీసాపై పాకిస్తాన్లో పర్యటించింది. ట్రావెల్ విత్ జో పేరుతో యూట్యూబ్ ఛానెల్ (youtube channel) నడుపుతోంది. ఈ క్రమంలో.. భారత సైనిక సమాచారం పాకిస్తాన్కు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. గూఢచర్యం ఆరోపణలపై ఆమెతో సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. కాగా.. పాకిస్తాన్ పర్యటనకు జ్యోతి మల్హోత్రాకు సహాయం చేసిన డానిష్ అనే పాకిస్తాన్ హైకమిషన్ అధికారితో (pakistan high commission official) ఆమెకు పరిచయం ఉందని తెలుస్తోంది.
