ePaper
More
    HomeతెలంగాణTPCC Chief | మంత్రివర్గ విస్తరణ.. టీపీసీసీ చీఫ్ కీలకవ్యాఖ్యలు

    TPCC Chief | మంత్రివర్గ విస్తరణ.. టీపీసీసీ చీఫ్ కీలకవ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: TPCC Chief | రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్ (PCC Chief Bomma Mahesh Kumar Goud)​ కీలక వ్యాఖ్యలు చేశారు. మే చివరలో లేదా జూన్​ నెలలో మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చని సూచనప్రాయంగా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆశావహులు ఎంతో మంది ఉన్నారని సీట్లు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. కానీ చాలామంది కేబినెట్​ విస్తరణపై (Cabinet expansion) ఆశలు పెట్టుకున్నారన్నారు.

    పీసీసీ చీఫ్​గా తనను కేవలం సలహాలు సూచనలు మాత్రమే అడుగుతారని చెప్పారు. గతంలో తనను విస్తరణపై సలహాలు అడిగితే ఇచ్చామని స్పష్టం చేశారు. తుది నిర్ణయం మాత్రం కాంగ్రెస్​ హైకమాండ్ (Congress high command)​, ముఖ్యమంత్రి సీఎం రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) తీసుకుంటారని పేర్కొన్నారు. ఇప్పటికే ఆలస్యమైనందున కేబినెట్​ విస్తరణ జరిగితే బాగుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

    TPCC Chief | తెలంగాణ సీఎం మార్పు ఉండదు..

    తెలంగాణలో సీఎం మార్పు ఉండదని బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్​ అన్నారు. విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. మంత్రి కొండ సురేఖ (Minister Konda Surekha) వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వారిపై సైబర్ క్రైమ్ (Cybercrime) పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. సోషల్ మీడియాపై తెలంగాణలోనూ మధ్యప్రదేశ్ (Madhya Pradesh) తరహా చట్టం తీస్తామన్నారు. ఈ నెలాఖరులో పూర్తిస్థాయిలో పీసీసీ కార్యవర్గం (PCC Executive Committee) ఏర్పాటు చేస్తామని తెలిపారు. మూడేళ్లు దాటిన చోట్ల జిల్లా అధ్యక్షులను మారుస్తామని స్పష్టం చేశారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...